వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఇక దీంతో ఆయన స్థానం ఆయనకే దక్కినట్టు అయ్యింది .

ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖ‌రారు చేసింది వైసీపీ అధిష్టానం. అనూహ్యంగా ఈ రోజు ఉదయం ఆయన ఎమ్మెల్సీ గా నామినేషన్ దాఖలు చేశారు ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గ‌డువు ముగియ‌నున్న నేపధ్యంలో ఆయన రాజీనామా చేసిన స్థానానికి తిరిగి ఆయనకే అవకాశం ఇవ్వటంతో ఎవరూ పోటీ చెయ్యలేదు .ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టలేదు .

Dokka Manikyavara Prasad unanimous election as MLC

మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యత్వానికి వర్ల రామయ్యను రంగంలోకి దించి పరాభవం పాలైన టీడీపీ ఇప్పుడు ఈ స్థానానికి పోటీ చెయ్యలేదని తెలుస్తుంది .రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి, టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన‌ డొక్కా నేడు మళ్ళీ ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక ద్వారా మండలిలో స్థానం సంపాదించి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ స్థానానికి మాణిక్య వరప్రసాద్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగియటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు తెలుస్తుంది .

English summary
Dokka Manikya Varaprasad's name as MLC candidate has been finalized by the YCP chief. surprisingly, this morning, he filed his nomination as an MLC. Nobody filed Nomination against dokka manikya varaprasad .with this his election declared unanimous .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X