వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ సీతారామారావులాంటివాడు, పార్టీ పెట్టరు: డొక్కా

By Pratap
|
Google Oneindia TeluguNews

Dokka terms Kiran Reddy as Seetha Ramarao
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గోపిచంద్ అసమర్థుని జీవయాత్ర నవలలోని సీతారామారావు పాత్ర లాంటివాడని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సీతారామావు పాత్ర వైఫల్యానికి, అసమర్థతకు నిదర్శనంగా ఆ నవలలో చిత్రితమైంది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టబోరని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసు పార్టీకి ఎవరు రాజీనామా చేసినా పెద్దగా పోయేదేమీ లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారో అర్థం కావడం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లు సమైక్యం ముసుగులో ప్రజలను మభ్య పెట్టారని మరో మంత్రి బాలరాజు విమర్సించారు. ఇన్నాళ్లు ఎవరికీ పదవులు ఇవ్వకుండా చివరి నిమిషంలో తనకు కావాల్సినవారికి కట్టబెట్టారని ఆయన విమర్శించారు. విభజన ప్రక్రియ కిరణ్ కుమార్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

తన పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమని శాసనసభ్యుడు వీరశివారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భుస్థాపితం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ పెట్టబోయే పార్టీలో తాను చేరతానని, సీమాంధ్రలో కిరణ్ పార్టీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని వీరశివారెడ్డి అభిప్రాయపడ్డారు.

English summary

 Dokka Manikya Varaprasad termed Kiran kumar Reddy as Seetharama Rao character in Gopichand's novel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X