వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీలో డాలర్ శేషాద్రి సేఫ్ ! ఆయనకు ఉద్వాసన లేనట్టేనా ? రీజన్ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న పదవీవిరమణ పొందిన వందమంది అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . అయితే వీరిలో డాలర్ శేషాద్రి పేరు కూడా ఉండటం ఏపీ లో హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఉద్వాసన పలుకుతున్న సిబ్బంది జాబితాలో డాలర్ శేషాద్రి పేరు లేదని తెలుస్తోంది. డాలర్ శేషాద్రి టీటీడీకి తన సేవలను కొనసాగించనున్నట్లుగా తాజా పరిణామాల నేపథ్యంలో కనిపిస్తుంది.

టీటీడీ నుండి డాలర్ శేషాద్రి ఔట్..! మరో వంద మందికీ ఉద్వాసన: తితిదే కీలక నిర్ణయం..!టీటీడీ నుండి డాలర్ శేషాద్రి ఔట్..! మరో వంద మందికీ ఉద్వాసన: తితిదే కీలక నిర్ణయం..!

టీటీడీ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న డాలర్ శేషాద్రి

టీటీడీ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న డాలర్ శేషాద్రి

డాలర్ శేషాద్రి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనకు ఎంత పేరుందో అంతే రేంజ్ లో ఆయన పై వ్యతిరేకత కూడా ఉంది. ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ విరమణ పొంది పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికీ ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు అంటేనే ఆయనకు ఉన్న గుర్తింపు ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం బాగా ప్రాచుర్యం పొందిన తరువాత గత 50 సంవత్సరాల కాలం నుండి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, సేవలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాలైన వ్యవహారాలపైన డాలర్ శేషాద్రికి పట్టుంది.

స్వామివారి కైంకర్యాలు, దేవాలయ సాంప్రదాయాలపైన శేషాద్రిది అపార అనుభవం

స్వామివారి కైంకర్యాలు, దేవాలయ సాంప్రదాయాలపైన శేషాద్రిది అపార అనుభవం

అంతేకాదు దేవాలయ సాంప్రదాయాలపైన, దేవాలయ క్యూలైన్ల నిర్వహణా వ్యవహారాల పైన డాలర్ శేషాద్రికి ఉన్న నాలెడ్జ్ అంతా ఇంతా కాదు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వ్యవహారంలో ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ ఆయనను మాత్రం స్వామివారి సేవ నుండి పక్కకు పెట్టలేదు. ఆయన 2008లో పదవీ విరమణ చేసినప్పటికీ ఇప్పటికీ ఆయన సేవలను టీటీడీ వినియోగించుకుంటుంది. ఇప్పుడు కూడా వైసిపి ప్రభుత్వం జారీ చేసిన పదవీ విరమణ అయినా ఇంకా టీటీడీలో కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలకటానికి ఇచ్చిన జీవో 2323తో ఆయనకు ఉద్వాసన పలుకుతారు అనుకుంటే అది కూడా సాధ్యం కాదు అని అర్థమౌతుంది. డాలర్ శేషాద్రికి ఉన్న ప్రత్యేకమైన వెసులుబాటు అందుకు కారణమని తెలుస్తుంది.

డాలర్ శేషాద్రిని తొలగిస్తే ప్రత్యామ్నయంగా ఎవరున్నారు ?

డాలర్ శేషాద్రిని తొలగిస్తే ప్రత్యామ్నయంగా ఎవరున్నారు ?

తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికారులుగా వచ్చిన ఎవరూ ఆలయ వ్యవహారాలపై మంచి పట్టున్న డాలర్ శేషాద్రి సేవలను వద్దనుకోరు. డాలర్ శేషాద్రికి టీటీడీ వ్యవహారాల పైన ఉన్న పట్టు, టీటీడీలో డోనర్ ల దగ్గర డాలర్ శేషాద్రికి ఉన్న ప్రాధాన్యత ఇందుకు కారణాలుగా భావించొచ్చు అనేది తిరుమల ఆలయ వర్గాలలో ఉన్న ప్రధానమైన చర్చ. అంతేకాదు టీటీడీ వ్యవహారాలపై, స్వామివారి కైంకర్యాలకు మంచి పట్టు ఉన్న డాలర్ శేషాద్రిని తొలగిస్తే ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం కూడా డాలర్ శేషాద్రి కొనసాగింపుకు కారణమని తెలుస్తుంది.

తొలగించిన అవుట్ సోర్సింగ్ జాబితాలో లేని డాలర్ పేరు

తొలగించిన అవుట్ సోర్సింగ్ జాబితాలో లేని డాలర్ పేరు

ఇక ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేస్తున్న పదవీ విరమణ పొందిన దాదాపు 100 మంది ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్టు సిబ్బంది పై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో డాలర్ శేషాద్రి పై కూడా వేటు పడుతుందని భావించారు. కానీ ఆయన తనపై వేటు పడకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తోంది. ఇక శ్రీవారి ఆలయంలో డాలర్ శేషాద్రి సేవలు ముగిసినట్లేనని అందరూ భావించినప్పటికీ వైసిపి ప్రభుత్వం జారీ చేసిన జీవో 2323 డాలర్ శేషాద్రికి వర్తించదని సిబ్బంది తొలగింపు జాబితా స్పష్టంగా చెబుతోంది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో డాలర్ శేషాద్రికి వర్తించదని చర్చ

ప్రభుత్వం జారీ చేసిన జీవో డాలర్ శేషాద్రికి వర్తించదని చర్చ

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పదవీ విరమణ పొంది తిరిగి టీటీడీలో కొనసాగుతున్న సిబ్బంది తొలగింపు ప్రక్రియను చేపట్టిన టీటీడీ నిన్న సాయంత్రం 100 మందికి ఉద్వాసన చెప్పింది. అయితే నిన్న తొలగింపునకు గురైన వారిలో డాలర్ శేషాద్రి పేరు లేకపోవడంతో డాలర్ శేషాద్రి సేఫ్ అని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉద్వాసనకు గురైన వారి పూర్తి వివరాలను నేడు వెల్లడి చెయ్యనున్న నేపథ్యంలో డాలర్ శేషాద్రి పేరు లేకపోవడం టిటిడిలో హాట్ టాపిక్ గా మారింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు డాలర్ శేషాద్రికి వర్తించే అవకాశం లేదని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో వాటిని పక్కన పెట్టారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా టీటీడీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డాలర్ శేషాద్రి సేఫ్ జోన్ లోనే ఉన్నారా అన్నదానిపై నేడు క్లారిటీ రానుంది.

English summary
The government has decided to lay off hundreds of outsourcing and contracting staff at Tirumala Tirupati Temple. But the name of Dollar Seshadri has become a hot topic in AP. Dollar Seshadri's name, however, does not appear to be on the list of the removed staff. The latest developments appear to be that Dollar Seshadri will continue his services to TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X