• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డేంజర్ బెల్స్ మోగిస్తున్న డాలర్ జీవితాలు..! స్వదేశమే సురక్షితమంటున్న విదేశీ ఉద్యోగులు..!!

|

హైదరాబాద్ : ఒక రంగం కాదు.. సకల రంగాలపైన, సకల వ్యవస్థల పైన కరోనా తన పంజా విసిరుతోంది. ఆదేశం ఈదేశం అనే తారతమ్యం లేకుండా ప్రతి దేశంపై దారుణంగా విరుచుకుపడుతోంది కరోనా వైరస్. బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ గంపెడాశలతో విదేశాలకు వెళ్లిన భారతీయు యువ ఉద్యోగులపై కరోనా పెను ప్రభావం చూపింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన వారి పరిస్తితి అగమ్యచరంగా తయారైనట్టు తెలుస్తోంది. దేశం కాని దేశంలో డాలర్లకు ఆశపడి పడరాని కష్టాలు పడే బదులు సొంత దేశంలో సంతోషంగా ఉద్యోగం చేసుకోవలానే నిర్ణయానికి విదేశీ ఉద్యోగులు వచ్చినట్టు తెలుస్తోంది.

విదేశీ ఉద్యోగం వద్దు.. స్వదేశమే బెటర్ అంటున్న విదేశీ ఉద్యోగులు..

విదేశీ ఉద్యోగం వద్దు.. స్వదేశమే బెటర్ అంటున్న విదేశీ ఉద్యోగులు..

కాగా వీరు ఈ నిర్ణయాన్ని కాస్త ఆలస్యంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు స్వదేశాలకు చేరుకోవడం ప్రస్తుతం అంత సులువైన పని కాదని తెలుస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్న తరుణంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అంతర్జాతీయ విమానయాన సేవలు కూడా రద్దవ్వడంతో అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. సరిగ్గా ఇదే తరుణంలో విదేశాల్లో ఉన్న భారత ఉద్యోగులు అనేక సమస్యల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులు కూడా విదేశీ ఉద్యోగాల్లో ఉన్న చికాకులపట్ల విసిగిపోయినట్టు తెలుస్తోంది. భారతదేశమే అన్ని విధాల అనుకూలమైన దేశంగా అభివర్ణిస్తున్నారు.

విదేశీ ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం.. కుదేలైన ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ..

విదేశీ ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం.. కుదేలైన ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ..

దేశ పరిస్ధితులు కరోనా వైరస్ కు ముందు కరోనా వైరస్ తర్వాత అనే విధంగా తయారయ్యాయి. కరోనా మహమ్మారి నుండి ఎప్పుడు బయటపడదామా అని సభ్యదేశాలు ఎదురుచూస్తున్న పరిస్ధితులు నెలకొన్నాయి. దేశం లోని వ్యవస్థలతో పాటు ప్రపంచంలోని అనేక రంగాలు కుదేలైన సందర్బంగా జనజీవనం ప్రశ్నార్తకంగా మారింది. మరీ ముఖ్యగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారత పౌరుల పరిస్థితి దారుణంగా తయారయినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కుటుంబ సభ్యుల పట్ల ఇంతకు ముందు ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. కాని ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న తమ పిల్లలు స్వదేశం చేరుకుని ఇంటికి వస్తే చాలని కోరుకుంటున్నారు.

ఛిన్నాభిన్నమైన ప్రపంచ ఆర్దిక వ్యవస్ద.. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిణామాలు..

ఛిన్నాభిన్నమైన ప్రపంచ ఆర్దిక వ్యవస్ద.. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిణామాలు..

విదేశాల్లో వివిధ దేశాల్లో వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వదేశం వచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. కంపెనీల నుండి కాకుండా సొంతంగా విమాన టికెట్ కొనుక్కుంటాం, మమ్మల్ని మా స్వదేశానికి చేర్చండని ప్రాధేయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇవే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి బతికితే చాలు డాలర్లు, యూరోలు వద్దు, విదేశీ చదువులు కూడా వద్దు. బతికుంటే బలుసాకు తింటాం అంటున్నారు విదేశాల్లో ఉండిపోయిన వారు. విదేశంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక వీసాలపై వెళ్లి పనిచేస్తున్న వారు వీరంతా, సాధ్యమయినంత తొందరగా భారత దేశానికి వచ్చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

విసిగిపోయిన ఉద్యోగులు.. స్వదేశానికి వచ్చేందుకు సుముఖత..

విసిగిపోయిన ఉద్యోగులు.. స్వదేశానికి వచ్చేందుకు సుముఖత..

అంతే కాకుండా సుమారు 30 వేల మంది తెలుగు వారు వేర్వేరు దేశాల నుంచి ఏపీకి రావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ప్రభుత్వం ఊహించిన దానికంటే పెద్ద సంఖ్య. విదేశాల నుంచి వారు రాగానే టెస్టులు చేసి క్వారంటైన్ కి గాని లేదా ఆస్పత్రికి గానీ తరలిస్తామని, వీరి కోసం దేశం నియమించిన ప్రత్యేక అధికారి కృష్ణబాబు వెల్లడించారు. ఈ క్వారంటైన్లో పెయిడ్ అంటుంది, ఫ్రీ క్వారంటైన్ కూడా ఉంటుందన్నారు. ఆ తర్వాత కూడా 14 రోజులు ఇంట్లో క్వారంటైన్లో ఉండాల్సిందేనని శరతులు విధిస్తున్నారు. అమెరికా నుంచి తొలి విమానం సోమవారం హైదరాబాద్‌ వస్తుంది. వీరిని విజయవాడలోనే క్వారంటైన్‌ చేస్తామని కృష్ణబాబు వెల్లడించారు.

English summary
About 30 thousand Telugu people have registered to come to AP from different countries.This is a larger number than the government had expected. When they come overseas, they will do tests and move to Quarantine or to a hospital, Krishnababu,the special officer, said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X