• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీరు లేకుంటే..: శిల్బా బ్రదర్స్‌పై బాబు సెటైర్లు, వైసిపి కొట్లాటలపై ఇలా..

|

అమరావతి: శిల్పా సోదరులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా సెటైర్లు వేశారు. తాను లేకపోతే నంద్యాల పొద్దుగడవదని శిల్పా మోహన్ రెడ్డి అనుకున్నారని ఎద్దేవా చేశారు.

చదవండి: పవన్ కళ్యాణ్‌పై విమర్శలు: సమాధానం ఇవ్వాలని తమ్ముడికి నాగబాబు

ఆ ధోరణి మంచిది కాదు

ఆ ధోరణి మంచిది కాదు

రెండు నెలల్లోనే తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి పదవి కూడా ఊడిపోయిందని చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ వర్క్ షాపులో చంద్రబాబు మాట్లాడారు. పార్టీలో చేరికలపై టిడిపి నేతలు విశాల దృక్ఫథంతో ఉండాలన్నారు. చేరికలతో పార్టీ బలపడాలని, మీరూ బలపడాలన్నారు. ఎవరూ పార్టీలోకి రాకూడదనే ధోరణి మంచిది కాదన్నారు.

మీడియా లేకుండా గెలిచాం, అసలు విజయం అది

మీడియా లేకుండా గెలిచాం, అసలు విజయం అది

సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించామని చంద్రబాబు అన్నారు. పేపర్, ఛానెల్ ఉన్న వైసిపి ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. గతంలో పార్టీకి దూరమైన వర్గాలు ఈ ఎన్నికల్లో టిడిపికి దగ్గరవడమే అసలు విజయమన్నారు. ఓటు బ్యాంకును కాపాడుకుందామన్నారు.

వైసిపి రెచ్చగొట్టే ప్రయత్నం

వైసిపి రెచ్చగొట్టే ప్రయత్నం

నంద్యాలలో కొత్త ఓటు బ్యాంకును సాధించుకోవడంతో గెలుపు సాధ్యమైందని చంద్రబాబు చెప్పారు. కులమతాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు విపక్షం ప్రయత్నించిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు పెద్ద పీట వేశారన్నారు.

వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ బెజవాడలో రోడ్డుకెక్కారు

వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ బెజవాడలో రోడ్డుకెక్కారు

విజయవాడలో ఒక నాయకుడు మరో కులాన్ని రెచ్చగొట్టారని, దీంతో ఆ సామాజిక వర్గం వాళ్లు ధర్నా చేశారని చంద్రబాబు.. రచ్చకెక్కిన వైసిపి నేతలు గౌతమ్ రెడ్డి, వంగవీటి రాధాలను ఉద్దేశించి అన్నారు. వైసిపిలో వాళ్లు వాళ్లూ కొట్టుకుని నగరంలో అశాంతిని రేకెత్తించారన్నారు.

ముందస్తు ఎన్నికలపై

ముందస్తు ఎన్నికలపై

2018 డిసెంబర్ నెలలో లేదా 2019 ఆరంభంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఇప్పటికే జోస్యం చెప్పారు. పబ్లిక్, పొలిటికల్, పోల్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. నంద్యాలలో టిడిపికి 56 శాతం ఓట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల నాటికి 60 ఖాతంగా ఉండాలన్నారు.

నంద్యాల నమూనా

నంద్యాల నమూనా

నంద్యాల ఎన్నికల నమూనానే అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ఎన్నికల సమాయత్తంలో భాగంగా 6 నెలల కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ నెల 11 నుంచి 50 రోజులపాటు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జలసిరికి హారతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM Chandrababu Naidu has given a lecture to his party leaders and cadre. After a roaring victory of TDP in Nandyal by-election and Kakinada Municipal Corporation polls, Chandrababu Naidu met his party leaders in the rank of TDP supremo and he cautioned leaders not to be "over confident" and asked them "not to take any chances" in upcoming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more