వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మా.. నేనున్నా, అధైర్య పడొద్దు., అండగా ఉంటాం, పిల్లలు జాగ్రత్త : జగన్

వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో భారీ జనసందోహం మధ్య సోమవారం జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్‌ ఓదార్చారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అంత్యక్రియాలు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామం చెరుకులపాడులో జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు.

నారాయణరెడ్డి, సాంబశివుడుల మృతదేహలకు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పోస్టుమార్టం ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేశారు. అనంతరం వారి మృతదేహాలను పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామానికి తరలించారు. అంత్యక్రియల్లో వైఎస్ జగన్ మాట్లాడారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు.

మంచి నాయకుడు.. ఓర్వలేక చేశారు..

మంచి నాయకుడు.. ఓర్వలేక చేశారు..

‘‘అధికార పార్టీ హత్యా రాజకీయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి పోరాడుతూ నారాయణ రెడ్డి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్య చేశారు. మీరెవ్వరూ అధైర్యపడొద్దు. అండగా మేమున్నాం'' అని చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు.

ఓదార్చిన జగన్...

ఓదార్చిన జగన్...

నారాయణ రెడ్డి అమర్‌ రహే అనే నినాదాలు, భారీ జనసందోహం మధ్య నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో సోమవారం జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జగన్‌ ఓదార్చారు. నారాయణ రెడ్డితో పాటు హత్యకు గురైన సాంబశివుడు కుటుంబాన్ని కూడా జగన్‌ ఈ సందర్భంగా పరామర్శించారు.

నేనున్నా.. పిల్లలు జాగ్రత్త..

నేనున్నా.. పిల్లలు జాగ్రత్త..

‘ఏం భయపడొద్దు అమ్మా నేనున్నాను' అని నారాయణ రెడ్డి కూతురు స్నేహా రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘అన్నా మీరే మాకు దిక్కు..' అని నారాయణ రెడ్డి కుమారుడు మోహన్‌ రెడ్డి.. జగన్‌ను పట్టుకుని భోరున విలపించారు. ‘పిల్లలను జాగ్రత్తగా చూసుకోమ్మా..' అని నారాయణ రెడ్డి భార్య శ్రీదేవికి జగన్‌ ధైర్యం చెప్పారు.

భారీగా హాజరైన జనసందోహం

భారీగా హాజరైన జనసందోహం

నారాయణరెడ్డి, సాంబశివుడుల మృతదేహలకు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పోస్టుమార్టం ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేశారు. అనంతరం వారి మృతదేహాలను పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నారాయణ రెడ్డి మృత దేహంతోపాటు ప్రజలు నినాదాలు చేస్తూ చెరుకులపాడుకు తరలివెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ముగిశాయి.

English summary
YSR CP Chief YS Jagan Mohan Reddy attended Narayana Reddy's funeral at Cherukulapadu on Monday evening and he expressed his condolence to his family members. He told them not to fear or worry.. he will be there for support them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X