వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా అని భయపడొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు: బాలయ్య పిలుపు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ అంటే చాలా మంది భయపడుతున్నారు. వైరస్ వస్తే ఫియర్‌కు గురై.. మరికొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. కరోనాను జయించొచ్చు.. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పలువుర పిలుపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పిలుపునిచ్చారు. బుధవార బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు సంగారెడ్డికి చెందిన మహేశ్వర మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, PPE కిట్స్, N95 మాస్క్ అందజేశారు.

కరోనా వైరస్ భయంతో ఆత్మహత్య చేసుకోవద్దని నందమూరి బాలకృష్ణ కోరారు. మనందరం కలిసి వైరస్‌ను జయించాలన్నారు. ఇదే అందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వైరస్ వచ్చిన చాలా మంది ప్లాస్మా థెరపీ చేయించుకుంటున్నారని తెలిపారు. దీనితో చాలా మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. కరోనా మహమ్మరిపై కలిసి పోరాడుదామని.. వైరస్‌ను మాత్రం ప్రజలు తేలికగా తీసుకోవద్దని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే మనకే నష్టమని సూచించారు.వాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలయ్య తెలిపారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నామని, చికిత్సకు వచ్చే ప్రతి వ్యక్తిని ముందుగా స్క్రీన్ చేస్తున్నామని చెప్పారు.

dont suicide fear of corona: balakrishna

ఇటు సినిమా షూటింగ్‌లకు సంబంధించి అనుమతి వచ్చిందని.. ఇండస్ట్రీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణ తెలిపారు. షూటింగ్‌ జరిగే సమయంలో చాలా మంది ఉంటారని తెలిపారు. అందుకే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు సమావేశమై.. నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలతోనే షూటింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

English summary
don't suicide fear of corona hindupur mla balakrishna said.altogether fight with virus.కరోనా వైరస్ అంటే చాలా మంది భయపడుతున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పిలుపునిచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X