హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

+92తో వస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, పాక్ నుండి కాల్స్.. జాగ్రత్త!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: +92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలంటే తాము సూచనలు ఫాలో కావాలను తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ తీయవద్దని, ఈ మెయిల్స్‌ను దూరం ఉంచాలని చెప్పారు. తద్వారా సీఐడీవిభాగం ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధమైంది.

సీఐడీ చీఫ్‌ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పలు సూచనలు చేశారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల మీద కాల్‌ వస్తే ఫోన్‌ తీయవద్దని పేర్కొన్నారు. ఇలాంటి అంకెలతో ప్రారంభమయ్యే నంబర్లతో ఎక్కువగా పాకిస్థాన్‌ నుంచి ఫోన్లు వస్తాయన్నారు.

Don’t take calls starting with +92

ప్రధానంగా తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ వారు నమ్మబలుకుతారన్నారు. అలాగే బీమా, ఆదాయపు పన్ను రిటర్న్‌ల కోసమంటూ బ్యాంకు ఖాతా నంబర్లు, ఏటీఎం పిన్‌ నంబరు చెప్పాలని వచ్చే ఫోన్లకు జవాబివ్వవద్దన్నారు.

బ్యాంకులు ఏవీ కూడా ఖాతాదారుడి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్ నంబర్లు కోరవని చెప్పారు. నలుపు రంగు కాగితాలను రసాయనాల్లో ముంచితే డాలరుగా మారుతుందని కొందరు మాయచేయజూస్తారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

English summary
The CID has released a list of “don'ts” for the public in order to prevent people from being victims of cyber attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X