విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మత్తయ్య నిందితుడని తెలియదు: విజయవాడ సిపి మాట

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో సంభవించిన ఓటుకు నోటు కేసులో మత్తయ్య నిందితుడనే విషయం తమకు తెలియదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పోలీసు కమిషనర్ ఎబి వెంకటేశ్వర రావు అన్నారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా తాము అదుపులోకి తీసుకోలేదని ఆయన చెప్పారు.

ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని ఆయన స్పష్టం చేశారు. మత్తయ్య నిందితుడైనా అతను మీడియాతో మాట్లాడుతున్నా తన నివాసాన్ని ఎప్పటికప్పుడు మారుస్తుండడంతో అతడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామని ఓ దశలో పోలీసులు చెప్పారు. ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మత్తయ్య విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, మత్తయ్య చేసిన ఫిర్యాదుపై కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించింది. నోటుకు ఓటు కేసు నిందితుడు మత్తయ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిక్కుల్లో పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Don't that Mattaiah is accused: Vijayawada CP

తనకు ప్రాణభయం ఉందని చెప్పడంతో మత్తయ్యను ఏపీసీఐడీ తమ రక్షణలోనే ఉంచుకున్నట్లు బుధవారంనాడు వార్తలు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందుతుడు మత్తయ్య కాల్‌డేటాను సీఐడీ అధికారులు సేకరించారు. కాల్‌డేటా ఆధారంగా మత్తయ్యకు ఫోన్‌ చేసిన నేతలు, అధికారుల వివరాలను సేకరిస్తున్నారు.

మత్తయ్య ఫిర్యాదు ఆధారంగా కేసీఆర్‌పై విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఫైల్‌ను సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తయ్య ఫిర్యాదుపై దర్యాప్తు ఏపీ సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు.

English summary
Vijayawada police commissioner AB Venkateswar Rao said that they are not aware of that Mattaiah is an accused in cash for vote case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X