వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2000 కోట్లు ఇచ్చారు..అందుకే చేరా: వైఎస్ఆర్ సీపీలో చేరడానికి వాడి పర్మిషన్ అవసరమా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తనకు ఒకరి అనుమతి అవసరం లేదని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఎవ్వరైనా, ఏ పార్టీలోనైనా చేరొచ్చని చెప్పారు. తన కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు మాట్లాడారు. పలు అంశాలపై స్పందించారు.

చంద్రబాబూ! నువ్వేమైనా సుందరయ్యవా? గౌతు లచ్చన్నవా? అప్పుడు నీ ఆస్తి ఎంత?..ఇప్పుడు ఎంత? <br>చంద్రబాబూ! నువ్వేమైనా సుందరయ్యవా? గౌతు లచ్చన్నవా? అప్పుడు నీ ఆస్తి ఎంత?..ఇప్పుడు ఎంత?

పరోక్షంగా కుటుంబ రావుపై సెటైర్లు..

పరోక్షంగా కుటుంబ రావుపై సెటైర్లు..

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు చేసిన వ్యాఖ్యలను మోహన్ బాబు ఉటంకించారు. ఆయన పేరు ఎక్కడా ఎత్తకుండా విమర్శలు చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, మోహన్ బాబు ధర్నా చేయడాన్ని కుటుంబరావు తప్పుపట్టిన విషయం తెలిసిందే. మోహన్ బాబుకు అంతగా ఆశ ఉంటే ప్రతిపక్ష పార్టీలో చేరొచ్చంటూ కుటుంబరావు వ్యాఖ్యానించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోహన్ బాబు ఆయనపై సెటైర్లు వేశారు.

జగన్ పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ అవసరమా?

జగన్ పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ అవసరమా?

ఎవరైనా, ఏ రాజకీయ పార్టీలోనైనా చేరాలనుకుంటే ఒకరి పర్మిషన్ అవసరమా? అని మోహన్ బాబు ప్రశ్నించారు. `వైఎస్ఆర్ సీపీలో చేరాలంటే నాకు వాడి (కుటుంబరావు) పర్మిషన్ అవసరా? వాడి అనుమతి తీసుకునే నేను పార్టీలో చేరాలా? గతంలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు వాడిని అడిగే చేరానా? లేదే? మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు..` అని మోహన్ బాబు చురకలు అంటించారు. తాను రాజకీయాల్లోకి చేరాలంటే.. ఏ పార్టీ కూడా కాదనదని అన్నారు. బీజేపీ నాయకులు చాలాసార్లు నన్ను ఆహ్వానించారని అన్నారు. వెంకయ్య నాయుడు, అద్వానీలతో కలిసి ఒకే కారులో తాను చిత్తూరు నుంచి చెన్నై వరకు ప్రయాణించానని, హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో వాజ్ పేయితో వేదికను పంచుకున్నానని చెప్పారు. తన వ్యక్తిత్వానికి, ముక్కుసూటి వైఖరికి రాజకీయాలు పనికి రావని చాలామంది సలహాలు ఇచ్చారని మోహన్ బాబు అన్నారు. ఎవరికో భయపడి, పార్టీల్లో చేరాల్సిన దుర్గతి తనకు పట్టలేదని అన్నారు. 20 సంవత్సరాల కిందటే రాజ్యసభకు వెళ్లొచ్చానని చెప్పారు.

చంద్రబాబు కూడా పిలిచారు..

చంద్రబాబు కూడా పిలిచారు..

తెలుగుదేశం పార్టీలో చేరాలని చంద్రబాబు కూడా తనను ఆహ్వానించారని మోహన్ బాబు అన్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని తనను ఆహ్వానించగా.. సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. భయపడే వైఎస్ఆర్ సీపీలో చేరారా? లేక డబ్బులు తీసుకున్నారా? అని ఈ సందర్భంగా ఒకరిద్దరు విలేకరులు గుచ్చి గుచ్చి ప్రశ్నించడాన్ని మోహన్ బాబు తేలిగ్గా తీసుకున్నారు. `జగన్ తనకు 1000 కోట్లు ఇచ్చారు. 1200 కోట్లు అనుకుంటా. కాదు..కాదు 2000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందుకే ఆయన పార్టీలో చేరా..` అని ఎద్దేవా చేశారు. ఎవరికీ భయపడే మనస్తత్వం తనది కాదని అన్నారు. తప్పు చేసినప్పుడో, చేయరాని పని చేసినప్పుడో భయపడతానని అన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని మోహన్ బాబు కాస్త ఆవేశంగా చెప్పారు. డబ్బుకు లొంగిపోవాలనుకుంటే.. ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండే వాడినే కాదని చెప్పారు. తన విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని, అందుకే ఈ ఆవేశం అని అన్నారు.

English summary
Dont need to take permission for join in any party for any person, says Mohan Babu. After joined in YSR Congress Party, Mohan Babu spokes with reportes. In Democracy system any person can joined in any Political Party, told Mohan Babu. Previously, Planning Commission Vece Chairman of Andhra Pradesh Kutumba Rao critics Mohan Babu. Then, he gave strong counter to Kutumba Rao indirectly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X