వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్థానిక ఎన్నికలకు మాత్రం నో.. మరీ బడులు తెరవడం అవసరమా..? పిల్లల ద్వారా పెద్దలకు.?

|
Google Oneindia TeluguNews

ఏపీలో పాఠశాలల ప్రారంభంపై పలువురి నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ పేరు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. మరీ స్కూల్స్ ఎందుకు ప్రారంభిస్తున్నారని అడుగుతున్నారు. పిల్లలు, వారి ఇంట్లో ఉంటోన్న పెద్దల సంగతి ఏంటీ అని అడుగుతున్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ గురించి ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో స్కూల్స్ రీ ఓపెన్ సరికాదు అని.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా అని అడుగుతున్నారు. పాఠశాలల్లో పిల్లల మధ్య భౌతిక దూరం సాధ్యమవుతోందా అని అడుగుతున్నారు. పిల్లలను గుమికూడకుండా ఆపడం అసాధ్యమని చెబుతున్నారు. 22 రాష్ట్రాలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోండగా.. ఏపీ మాత్రం నిర్వహించాలని కోరుకోవడం సరికాదన్నారు.

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ నో..? గోప్యంగా ఎస్‌వోపీ భేటీ, కారణమిదేనా..ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ నో..? గోప్యంగా ఎస్‌వోపీ భేటీ, కారణమిదేనా..

ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులు..

ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులు..

ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించి తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సెప్టెంబరు 5వ తేదీ నుంచి తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా తరగతుల విద్యార్థులు 40 శాతం మంది వరకు పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈ విధానం ప్రభుత్వం ఆశించిన రీతిలో అమలు కావడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన, కొందరు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడం, మరి కొందరు ఈ రెండింటికీ దూరంగా ఉండటం వంటి వేర్వేరు పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఒకే తరగతి విద్యార్థులకు భిన్నమైన రీతిలో బోధన జరుగుతోంది.

నియంత్రించడం కష్టమే..

నియంత్రించడం కష్టమే..

ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తరగతి గదుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఇంటర్వల్‌, భోజన సమయాల్లో గుమికూడకుండా పిల్లలను ఎలా నియంత్రించడం కష్ట సాధ్యమవుతోంది. కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోక ముందే పిల్లలను పాఠశాలలకు రప్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామనడం కచ్చితంగా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. 14 ఏళ్ల లోపు పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించవని.. కానీ వారి ద్వారా ఇళ్లలో ఉండే వృద్ధులు, పెద్దలకు వైరస్‌ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవీ కేసులు

ఇవీ కేసులు

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గవండ్లపాలెం, ముండ్లమూరు మండలం మారెళ్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు ఆన్‌లైన్‌ పాఠాలపై సందేహాల కోసం వచ్చిన 9-10 తరగతుల విద్యార్థుల్లో 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇటు విజయనగరం జిల్లా గంట్యాడ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు కరోనా వైరస్ సోకింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం యూపీ స్కూల్ హెడ్మాస్టర్‌కు, రాజుపాలెం మండలం గణపవరం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది.

22 రాష్ట్రాల్లో ఆన్ లైన్ క్లాసులు..

22 రాష్ట్రాల్లో ఆన్ లైన్ క్లాసులు..

దేశంలో 22 రాష్ట్రాలు ఆన్‌లైన్‌ తరగతులకే కట్టుబడి ఉన్నాయి. నాగాలాండ్‌, అసోం రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించి.. పరిస్థితి మారకపోవడంతో మళ్లీ మూసివేశాయి. ఢిల్లీ సర్కార్ సెప్టెంబరు 21 నుంచి 9, 10, 11, 12 తరగతుల వరకు పాఠశాలలు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను మూసేయాల్సిందిగా విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా ఆదేశించారు.

కర్ణాటకలో జీరో ఇయర్

కర్ణాటకలో జీరో ఇయర్

మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పాఠశాలలను మళ్లీ తెరవలేదు. కర్ణాటక ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరాన్ని రద్దు చేసి, జీరో ఇయర్‌గా ప్రకటించింది. కానీ ఏపీలో మాత్రం పాఠశాలలు తెరవడంపై ఆందోళన నెలకొంది. నవంబర్ 2వ తేదీ సోమవారం నుంచి 9,10 తరగతులకు క్లాసులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

English summary
dont want local elections but re-open schools some people ask andhra pradesh government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X