ప్రయత్నిస్తున్నాం, సెషన్లో టి బిల్లు వస్తుందో లేదో: ఆజాద్

కోల్‌కతా/న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంటులో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అయితే, ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు సభకు వస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని కేంద్రమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మాజీ ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ బుధవారం అన్నారు.

ఆయన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విలేకరులతో తెలంగాణ అంశంపై మాట్లాడారు. వీలైనం త్వరగా పార్లమెంటుకు తెలంగాణ బిల్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శీతాకాల సమావేశాల్లో వస్తుందని అప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై జివోఎం వేగంగా పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయన్నారు.

Telangana Bill

జైరాం మెరుగులు

తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రుల బృందం సభ్యులు (జివోఎం), కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో మెరుగులు దిద్దుతున్నారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు జివోఎం భేటీ కానున్న విషయం తెలిసిందే.

జెపిని కలిసిన ఎపిఎన్జీవోలు

ఎపిఎన్జీవోలు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణను పార్టీ కార్యాలయంలో కలిశారు. శాసన సభలో రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+