వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిటిడి పదవిపై ట్విస్ట్: పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌గా తెరపైకి బాబు సన్నిహితుడు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయంలో తెరపైకి కొత్త పేరు వచ్చింది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కే లక్ష్మీనారాయణ పేరు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయంలో తెరపైకి కొత్త పేరు వచ్చింది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కే లక్ష్మీనారాయణ పేరు వచ్చింది. సీఎం చంద్రబాబు ఈయన పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు ఖాయమైందంటున్నారు.

<strong>తెలుసుకో: బీజేపీ, పవన్ కళ్యాణ్ 'ఉత్తరాది'పై మోహన్ బాబు గట్టి ఝలక్</strong>తెలుసుకో: బీజేపీ, పవన్ కళ్యాణ్ 'ఉత్తరాది'పై మోహన్ బాబు గట్టి ఝలక్

టిటిడి చైర్మన్ రేసులో ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, మురళీ మోహన్, గోకరాజు రంగరాజు తదితరుల పేర్లు వినిపించాయి. అయితే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పదవులు ఇవ్వనని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది.

అనిల్ సింఘాల్‌ నియామకంపై విమర్శలు

అనిల్ సింఘాల్‌ నియామకంపై విమర్శలు

టిటిడి ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తీసుకు వచ్చారు. ఇది విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. టిడిపి, బిజెపి దీనిపై కౌంటర్ ఇవ్వడం వేరే విషయం. కానీ విమర్శలు మాత్రం వచ్చాయి.

పవన్ సహా వారికి కౌంటర్

పవన్ సహా వారికి కౌంటర్

ఉత్తరాదిన మన అధికారులకు పదవులు ఇవ్వకుండా, దక్షిణాదిన ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ సహా పలువురు తప్పుబట్టారు. దీంతో మరో అధికారికి టిటిడి ఈవో పదవి ఇచ్చి వారి విమర్శలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈయన అభ్యర్థిత్వంపై అందరు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

చంద్రబాబుకు సన్నిహితులు

చంద్రబాబుకు సన్నిహితులు

రిటైర్డ్ అధికారి అయిన లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు ఫౌండర్ కమ్ డైరెక్టర్. ఆయనను టిటిడి చైర్మన్‌గా నియమించాలని భావిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులు.

రాయపాటి ఏం చేస్తారు?

రాయపాటి ఏం చేస్తారు?

నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యే, ఎంపీలకు ఇవ్వవద్దని సీఎం చంద్రబాబు ఇటీవల నిర్ణయించారు. దీంతో రేసులో ఉన్న మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావు, గోకరాజు రంగరాజు తదితరులకు షాక్ తగిలింది. అయితే టిటిడి చైర్మన్ పదవి కోసం ఎంపీ పదవికి రాజీనామాకు కూడా సిద్ధమని రాయపాటి చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు ఆ పదవి ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో రాయపాటి ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు, లక్ష్మీనారాయణ ఒకేసారి..

చంద్రబాబు, లక్ష్మీనారాయణ ఒకేసారి..

1972 నుంచి లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబుకు సన్నిహితులు. చంద్రబాబు, లక్ష్మీనారాయణలు శ్రీ వెంకటేశ్వర వర్సిటీ విద్యార్థులు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. అదే ఏడాది లక్ష్మీనారాయణ గ్రూప్ 1కు సెలక్ట్ అయ్యారు.

ఎన్టీఆర్ హయాంలో.. 1983 నుంచి 1989 వరకు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్‌లో పని చేశారు. చంద్రబాబు హయాంలో 1995 నుంచి 2004 వరకు కూడా పని చేశారు. లక్ష్మీనారాయణ మంచి అనుభవజ్ఞుడైన అధికారి. దాదాపు అన్ని పార్టీల నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణను చైర్మన్‌గా చేస్తే మంచి ఎంపిక అవుతుందని అంటున్నారు.

English summary
The state government is all set to appoint retired IAS officer Dr K. Lakshminarayana as the chairman of TTD. Despite extensive lobbying by MP Rayapati Sambasiva Rao and MP Murali Mohan, the gover-nment has decided not to give the post to an MLA or MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X