వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ వివేకా హత్య కేసు - సుప్రీంకు సునీత : ప్రతివాదులుగా కేంద్రం..రాష్ట్రం..సీబీఐ..!!

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకా కుమార్తె సునీత మరో అడుగు ముందుకేసారు. తన తండ్రి హత్య కేసులో సుప్రీం పర్యవేక్షణ కావాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇప్పటికే వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. కానీ పురోగతి లేదంటూ సునీత సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన లో పేర్కొన్నారు. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. అందులో హత్య జరిగిన సమయం నుంచి చోటు చేసుకున్న అంశాలను ప్రస్తావించారు.

అభియోగాలు ఎదుర్కొంటున్న వారే సీబీఐ పైన కేసులు నమోదు చేస్తున్నారంటూ పిటీషన్ లో పేర్కొన్నారు. గతంలో వివేకా హత్య కేసులో హైకోర్టును సునీత ఆశ్రయించారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. సునీత అభ్యర్ధన మేరకు సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో అనేక మంది అనుమానితులను విచారించింది. పలువురిని అరెస్ట్ చేసింది. పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. విచారణ సమయంలో అప్రూవర్ గా మారటం..పలువురి పేర్లు ప్రస్తావించటంలో వారిని సీబీఐ కేసులో నిందితులుగా చేర్చింది. ఆ తరువాత వారు బెయిల్ పైన బయటకు వచ్చారు.

Dr Sunitha filed petition in Supreme court, Seek court supervision in Viveka murder case

కాగా, తాజాగా సుప్రీం వారి బెయిల్ రద్దు చేసింది. దీని పైన రాజకీయంగానూ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక, సీబీఐ అధికారులు తమను బెదిరిస్తున్నారంటూ కడప స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందాయి. పులివెందులకు చెందిన దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వివరాలను సునీత తన పిటీషన్ లో కోర్టు ముందు ఉంచింది. విచారణ పూర్తి చేసే వరకూ సుప్రీం పర్యవేక్షణ ఉండాలని సునీత సుప్రీంను కోరారు. దీంతో..ఇప్పుడు సుప్రీం కోర్టు సునీత పిటీషన్ పైన ఏ రకంగా స్పందిస్తుందీ.. ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Dr Sunitha Filed petition in supreme court on seek court superision on YS Viveka's muder case investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X