విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాళం పగులగొట్టైనా లోపలకెళ్తా: కొడాలి నాని సవాల్, ఉద్రిక్తత, టిడిపి నేత అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: గుడివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు టిడిపి నేత బుద్దా వెంకన్న, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు.

గుడివాడలో వైసిపి కార్యాలయం ఉన్న భవనం విషయమై ఆదివారం నుంచి గొడవ జరుగుతోన్న విషయం తెలిసిందే. భవనాన్ని ఖాళీ చేయాలని యజమానులు... కొడాలి నానికి గతంలో చెప్పారు. ఆయన ఖాళీ చేయక పోవడంతో ఆదివారం తాళం వేసుకున్నారు.

ఆదివారం నాడు నాని కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో యజమానులు, పోలీసులతో కొడాలి నాని వాగ్వాదానికి దిగారు. దీంతో, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని, సాయంత్రం విడుదల చేశారు.

Dramatic scenes at Gudiwada YSRCP office

అయితే, కొడాలి నాని భవనంలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. అవసరమైతే తాను తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్తానని సవాల్ చేశారు. దీంతో, టిడిపి నేతలు బుద్దా వెంకన్న తదితరులు సోమవారం ఉదయం భవనం వద్దకు చేరుకున్నారు. నానికి, వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొంతకాలంగా భవనం ఖాళీ చేయమని చెప్పినా కొడాలి నాని ఖాళీ చేయడం లేదని, అద్దె ఇవ్వడం లేదని భవన యజమానురాలు ఆరోపిస్తున్నారు. పోలీసులు భవనానికి తాళం వేసి యజమానురాలికి అప్పగించారు.

English summary
MLA Kodali Nani tried to open the lock of building and entered into an argument with the owner of the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X