వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీక‌ర్‌గా ఇద్ద‌రి పేర్లు ప‌రిశీల‌న‌: మ‌ంత్రుల శాఖ‌లు ఖ‌రారు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Cm 2019 : స్పీకర్ గా రోజా... హోమ్ మినిస్టర్ గా పెద్దిరెడ్డి || Oneindia Telugu

ఏపీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ‌లోనే ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యం లో త‌న‌తో పాటే పూర్తి కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే త‌న టీం ను సిద్దం చేసుకున్నారు. పార్టీ నుండి అందుతున్న స‌మాచారం మేరకు స్పీక‌ర్‌గా రోజా లేదా ఆనం రామానారాయ‌ణ రెడ్డి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రోజాను ఇబ్బంది పెట్టిన చంద్ర‌బాబుతో అధ్య‌క్షా అని పిలిపించాలంటో రోజాను స్పీక‌ర్‌గా చేయాల‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే, టీడీపీ స‌భ్యుల సంఖ్య సైతం త‌క్కువ‌గా ఉండ‌టంతో రోజాకు అవ‌కాశం పైన జ‌గ‌న్ దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం.

డ్రీం కేబినెట్‌లో స్థానం ఎవ‌రికంటే...

  • ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి
  • స్పీకర్ : రోజా లేదా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి
  • డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
  • రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
  • హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
  • ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
  • రోడ్స్ & భవనాలు : బొత్స సత్యనారాయణ
  • భారీ నీటి పారుదల : కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు
  • మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
  • స్త్రీ శిశువు సంక్షేమం : తానేటి వనితా
  • పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
  • వైద్య : అవంతి శ్రీనివాస్
  • విద్య : కురసాల కన్నబాబు
  • బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
  • అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
  • దేవాదాయ : కోన రఘుపతి
  • పంచాయతీ రాజ్ : అనంత వెంక‌ట్రామిరెడ్డి
  • ఐటీ : మేక‌పాటి గౌతం
  • విద్యుత్ శాఖ : త‌మ్మినేని సీతారాం
  • మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
  • సినిమాటోగ్రఫీ: గ్రంధి శ్రీనివాస్
  • కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని
  • సాంగిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి
  • వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
  • మార్కెటింగ్, పశుసంవర్థకం : అనిల్ కుమార్ యాద‌వ్‌
  • టూరిజం, తెలుగు సంస్కృతి,దేవాదాయ : కోన రఘుపతి
  • గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
  • ఇండస్ట్రీస్ : కాకాని గోవర్ధన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

Dream cabinet in ready to sworn along with new CM Jagan no 30th this month

జ‌గ‌న్‌తో పాటే ప్ర‌మాణ స్వీకారం..
త‌న‌తో పాటే మొత్తం కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం జ‌గ‌న్‌తో స‌మావేశ‌మైన స‌మ‌యంలో సైతం ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. అన్ని ప్రాంతాలు.. సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకొని గ‌తంలో అవ‌కాశం లేని సామాజిక వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నారు. దీంతో..జ‌గ‌న్ చేస్త‌న్న ఈ క‌స‌ర‌త్తులో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేది చూడాలి.

English summary
Jagan decided his dream cabinet with all area and caste equations. On 30th of this month Jagan ready sworn along with cabinet ministers. Cabinet list almost all cleared by jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X