వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హలో..నేను చంద్రబాబు నాయుడిని...ముఖ్యమంత్రిని...దావోస్ నుంచి...అవాక్కైన గిరిజనులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

దావోస్ నుంచి వీడియో కాల్...అవాక్కైన గిరిజనులు

అమరావతి,దావోస్,రంపచోడవరం: అది ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామం...కొండలు...కోనల మధ్య ఉండే ఆ గ్రామానికి ఈ మధ్య కాలంలో ఫోను సదుపాయం కూడా లేదు...ఇక ఇంటర్‌నెట్‌ అంటే ఆ వూళ్లో దాదాపుగా ఎవరికీ తెలియదు...అలాంటి గిరిజన ప్రాంతంలోకి ఒకరు ఫోన్ తీసుకొచ్చి ఓ వ్యక్తికి ఇచ్చి మీకు కాల్ వచ్చింది...సార్ మాట్లాడతారని ఫోన్ చేతికి ఇచ్చారు...అది వీడియోకాల్...ఆ ఫోన్ మాట్లాడే వ్యక్తిని చూస్తూ.. ఆయన మాటలు వింటూనే ఆ వూరి వారందరూ షాక్ అయ్యారు....కారణం...

ఆ వీడియో కాల్ లోని వ్యక్తి తమకు బాగా తెలిసినవారే...ఆయన ఇలా మాట్లాడుతున్నారు...''బ్రదర్‌... నేను నారా చంద్రబాబు నాయుడిని... మీ ముఖ్యమంత్రిని... దావోస్‌ నుంచి మాట్లాడుతున్నాను...ఎలా ఉన్నారు?'' అని అడిగారు!...ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తమ యోగక్షేమాలు కనుక్కోవడం, అందులోనూ దావోస్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడంతో స్థానికులు అవాక్కైపోయారు...ఆ తరువాత తేరుకొని సంబరాలు జరుపుకున్నారు...

 ఆ కాల్ చేసింది సిఎం...దావోస్ నుంచి...

ఆ కాల్ చేసింది సిఎం...దావోస్ నుంచి...

సో...ఆ వీడియో కాల్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయన కాల్ చేసింది దావోస్ నుంచి...ఆ వూరు జాజివలస...
రంపచోడవరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మారుమూలపల్లెకు ఈ విధంగాతొలిసారిగా ఫోను, ఇంటర్నెట్‌, కేబుల్‌టీవీ సదుపాయాలు ఒకేసారి పలకరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ ఈ మారుమూలనున్న గిరిజన గ్రామానికి సాధారణ జనంతో మమేకమయ్యేలా కనెక్టివిటీ కల్పించింది.

 అక్కడి నుంచే...వీడియో కాన్ఫరెన్స్...

అక్కడి నుంచే...వీడియో కాన్ఫరెన్స్...

జాజివలస గ్రామానికి ఫైబర్ నెట్ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం దావోస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దినేశ్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌లు అక్కడి గిరిజనులను, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని ముఖ్యమంత్రితో మాట్లాడించారు. సీఎం తమకు ఫోన్‌ చేయడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. "ఈ ఫోన్ కాల్ మాత్రమే కాదమ్మా...ఇప్పుడు మీ గ్రామానికి కేబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ సదుపాయాలు కూడా వచ్చాయి. మీరు ఇక నుంచి నేరుగా నాతో మాట్లాడొచ్చు...మీ సమస్యలను నేనే స్వయంగా పరిష్కరిస్తాను. అధికారులు మీకు అందించే సేవల గురించి కూడా నేరుగా మీతోనే మాట్లాడతాను"...అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో భరోసా ఇవ్వడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

అన్నట్లు గానే...చిటికెలో వరం......ఇచ్చిన సిఎం

అన్నట్లు గానే...చిటికెలో వరం......ఇచ్చిన సిఎం

అదే వీడియో కాల్ లో ఓ గిరిజన మహిళ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ...సార్..మాకు ఇల్లు లేదు...పడిపోయింది...అంటూ తన సమస్య చెప్పుకుంటే...అదే వీడియో కాన్ఫరెన్స్ లో ఆమెకు ఇల్లు కూడా మంజూరు చేసారు చంద్రబాబు...దీంతో ఆమె చెప్పలేనంత భావోద్వేగానికి గురై పదే పదే సిఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

 ఇదంతా... ఎలా సాధ్యపడిందంటే?...

ఇదంతా... ఎలా సాధ్యపడిందంటే?...

కనీస సమాచార వ్యవస్థ లేని ఆ గ్రామాన్ని ప్రపంచంతో సంధానం చేసింది ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ...ఇలా ఎలాంటి కమ్యూనికేషన్‌ సదుపాయమూ లేని మారుమూల ప్రాంతాలకు కూడా టెలిఫోన్‌, కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయాలను వైర్‌లెస్‌ విధానంలో కల్పించడం...ప్రపంచంలో కూడా ఇదే తొలిసారి అంటున్నారు. గూగుల్‌ ఎక్స్‌ సంస్థ సహకారం తీసుకుని ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌(ఎఫ్ఎస్ ఓసీ) ద్వారా ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ ఈ సదుపాయం కల్పించింది. దీంతో ఇప్పుడు ఆ గ్రామం టివి, మొబైల్ & ఇంటర్నెట్ ఇలా అన్ని ఆధునిక,సాంకేతిక సేవలు వాడుకోవచ్చు...ఈ తాజా మార్పుతో అక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేవు...

ఇదే సేవలు...విస్తరణ...మరో గ్రామానికి

ఇదే సేవలు...విస్తరణ...మరో గ్రామానికి

ఇదే విధంగా సీఎం చంద్రబాబు బుధవారం దావోస్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వై.రామవరం మండలంలోని మరో ఏజెన్సీ గ్రామమైన చాపరాయి గిరిజనులతో మాట్లాడతారని తెలిసింది. కుదిరితే ప్రధాని మోదీతోనూ ఇక్కడి గిరిజనులను మాట్లాడించడానికి అధికారులు చర్యలు చేపట్టారని సమాచారం.

English summary
AP CM Chandrababu on Tuesday launched the video conferencing facility from Davos for the tribals living in Rampachodavaram Agency of Jajivalasa village in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X