హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి:రాజమండ్రి విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఓ అగంతకుడు 1.9 కిలోల బంగారాన్ని పేస్ట్‌ రూపంలోకి మార్చి హైదరాబాద్ కి తరలించే క్రమంలో రాజమండ్రి తెచ్చినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు.

ఈ వ్యక్తే బంగారాన్ని ఈ విధంగా పేస్ట్ రూపంలో తయారుచేసి కొలంబో నుంచి మధురై మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. దీంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎట్టకేలకు ఆ స్మగ్లర్ ను పట్టుకున్నారు. అనంతరం బంగారంతో పాటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

DRI nabs passenger carrying 1.9 kg of gold paste at Rajahmundry airport

ఇదిలావుంటే

చిట్టీల పేరుతో కోట్ల రూపాయాలకు స్థానికులకు శఠగోపం పెట్టిన చిట్టీల వ్యాపారి ఉదంతం ఇది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్‌నగర్‌ లో చోటుచేసుకుంది. చిన్న మాంతయ్య అనే చిట్టీల వ్యాపారి సుమారుగా రూ. మూడు కోట్లతో ఉడాయించినట్లు తెలిసింది. చిట్టీలు పాడించి, ఆ తరువాత ఆ మొత్తాన్ని వడ్డీకి అప్పుగా తీసుకున్న చిన్న మాంతయ్య ఎవరికీ చిల్లిగవ్వ ఇవ్వకుండా ఇలా రాత్రికి రాత్రే పరారయ్యాడు.

దీంతో బాధితులు లబోదిబో మంటూ రోడ్డెక్కగా...మీ సొమ్ముకు మేము బాధ్యులం...ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని చిన మాంతయ్య సోదరులు మొదట హామీ ఇచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ ఈ వ్యవహారంతో తమకు సంబంధంలేదని, అంత డబ్బులు తిరిగి ఇవ్వడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో మాంతయ్య ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.

అయితే చిన మాంతయ్య ఈ విధంగా మోసగించేందుకు గత కొన్ని నెలలుగా పక్కా పథకం ప్రకారం సిద్దమవుతూ వచ్చాడని, అందులో భాగంగానే ఆయన తన ఆస్తులను అమ్మేశాడు...తాజాగా తన ఇంటిపై కూడా ఫైనాన్స్ తీసుకుని ఈ మొత్తం సొమ్ముతో ఉడాయించా. దీంతో బాధితులు పోలీసులకు పిర్యాదు చేయగా వారు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాధితులు తమను ఆదుకోవాలంటూ మంత్రి శిద్ధా రాఘవరావుకు వినతి పత్రం ఇచ్చారు.

English summary
DRI officials seized 1.9 kg of gold from A Smuggler at Rajamundry airport. This gold is in the form of a paste and it brought to Rajahmundry in order to move to Hyderabad, said DRI officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X