నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగుబోతుల వీరంగం: ప్రశ్నించిన పోలీసులపై దాడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాచారం మండల పరిధిలోని మాల్ మార్కెట్లో కొంతమంది తాగుబోతులు వీరంగం సృస్టించారు. అంతేగాక, ప్రశ్నించిన పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. మాల్‌మార్కెట్లో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశంలో కొంతమంది మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న చింతపల్లి, యాచారం మండల పోలీసులు వారిని మందలించారు. దీంతో వారు పోలీసులపై తిరుగబడి దాడి చేశారు.

ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. 18 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్సై రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.

 Drinkers allegedly attacked on Police

హాస్టల్ విద్యార్థులను చితకబాదిన పోలీసులు

హైదరాబాద్: భోజనం బాగోలేదని ఆందోళన చేస్తున్న హాస్టల్ విద్యార్థులను పోలీసులు చితకబాదారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురంలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో చోటుచేసుకుంది. భోజనం బాగలేదని విద్యార్థులు నిరసనకు దిగారు.

విద్యార్థులకు సర్ధిచెప్పి సమాధానపరచాల్సిన కళాశాల యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యాజమాన్యం సూచనల మేరకు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు

నిజామాబాద్: బోధన్ మండలం ఊటుపల్లిలో గోవింద్‌ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రైతును చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతు పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసింది.

English summary
Some Drinkers on Sunday night allegedly attacked on Policemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X