వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరువు బారిన పల్లెలు .. ఉపాధి కోసం సొంతవారిని, ఊరిని వదిలి వలసలు

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తుంది. ఒక్క ప్రకాశం జిల్లా నుండే 30 నుండి 40 వేల మంది దాకా ఊర్లను ఖాళీ చేసి వలస వెళ్ళారు అంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు పడక, పంటలు పండక, రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులతో ఉపాధి కోసం వలస పోతున్నారు ప్రకాశం జిల్లా వాసులు.

జూన్ 20 నుండి ఏ పార్టీ నాయకుడైనా వైసీపీలో చేరొచ్చు కానీ వారికి మాత్రమేజూన్ 20 నుండి ఏ పార్టీ నాయకుడైనా వైసీపీలో చేరొచ్చు కానీ వారికి మాత్రమే

కరువు పీడిత ప్రాంతం ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం .. వలస బాట పట్టిన గ్రామాలు

కరువు పీడిత ప్రాంతం ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం .. వలస బాట పట్టిన గ్రామాలు


కందుకూరు ప్రాంతంలోని హనుమంతుని పాడు, కొండారెడ్డి పల్లె, వెలిగండ్ల, రాళ్లపల్లి, కండ్రిక ఇలా కందుకూరు నియోజకవర్గంలోని ప్రజలు కరవు రక్కసి కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నారు. జానెడు పొట్ట కోసం పక్క ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు వలస పోతూ నానా అవస్థలు పడుతున్నారు. కందుకూరు నియోజకవర్గం లోని దాదాపు వందకు పైగా గ్రామాలను మూడో వంతు పైగా కుటుంబాలు ఇప్పటికే వలస పోయాయి. ఇక గ్రామాల్లో నివసిస్తున్న వారు ఎవరో చూస్తే వృద్ధులైన తల్లిదండ్రులు, వారి మనవళ్లు మనవరాళ్లను పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇక కొడుకులు కోడళ్ళు, కూతుళ్లు అల్లుళ్లు ఇలా యుక్తవయసులో ఉన్న వారంతా పక్క ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధికి నానా తిప్పలు పడుతున్నారు.

ఊర్లో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలస ..తల్లిదండ్రులను, చిన్నారులను విడిచి వెళ్తున్న తనయులు

ఊర్లో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలస ..తల్లిదండ్రులను, చిన్నారులను విడిచి వెళ్తున్న తనయులు


ఈ గ్రామాలలోని ఒక్కొక్కరిది ఒక్కో కథ.. వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక పిల్లలను తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి భార్యాభర్తలు కాయకష్టం చేసుకోవడానికి, కూలీనాలీ పనులు చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఏడాదిలో పది నెలల పాటు కష్టపడి ఒక్క రెండు నెలలు మాత్రం కుటుంబాలతో గడపడానికి గ్రామానికి వస్తుంటారు. ఇలా ప్రతి ఊరులోనూ చిన్నారులు, వృద్ధులు మినహాయించి నడివయసు వారు కానీ, యువకులు కానీ లేకపోవడం గమనార్హం. ఉన్న ఊళ్లో ఉపాధి దొరక్క పక్క ఊర్లకు వలసపోతున్న ప్రజలు తమ వారిని విడిచి కంటికి కడివెడు దుఃఖిస్తూ వెళుతున్నారు. ఇక కొడుకు కోడలు ఆసరాగా ఉండాల్సిన వయసులో వారి పిల్లల భారాన్ని మోస్తూ వృద్ధులైన తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో వారిని వలస పంపుతున్నారు.

కరువు ప్రత్యామ్నాయ చర్యలు అవసరం.. ఉపాధి చూపిస్తే వలసలు తగ్గుముఖం పట్టే అవకాశం

కరువు ప్రత్యామ్నాయ చర్యలు అవసరం.. ఉపాధి చూపిస్తే వలసలు తగ్గుముఖం పట్టే అవకాశం

ప్రకాశం జిల్లాలోని కరువు దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉపాధి కోసం పక్క ప్రాంతాలకు వలస వెళుతున్న వివిధ గ్రామాల ప్రజలను గ్రామంలోనే ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నం జరిగితే గ్రామాల నుండి వలసలు తగ్గి కుటుంబాలు ఎడబాటు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

English summary
Prakasam is one among the nine out of 13 drought-affected districts in Andhra Pradesh, as all surface water sources at Yerragondapalem and surrounding mandals have dried up. The only source of water is borewells, a vast majority of which are already defunct. Around 30 to 40 thousand people have been evacuated from Prakasam district alone. Prakasam district residents migrating for employment with rain, beds, crops and wrecked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X