హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ రాకెట్ రాకెట్ పట్టివేత: దావూద్ గ్యాంగ్‌తో లింక్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Drug
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. 11 కిలోల కెటామిన్ డ్రగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో తయారు చేసి మలేషియాకు తరలిస్తున్న డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

డ్రగ్ రాకెట్‌కు చెందిన అజీజ్‌తో పాటు మురళీ, కమ్మ శ్రీను, రాజు, శివ, లక్కీసింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 15 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. హవాలా పద్ధతిలో చెల్లింపులు ఉండేవని పోలీసులు కనుగొన్నారు. వారంతా చెన్నైకి చెందినవారని అంటున్నారు.

డ్రగ్స్ ముఠాను అజీజ్ ముఠాగా పిలుస్తున్నారు. వారికి దావూద్‌ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు ఉండవచ్చునని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. జీడిమెట్లలోని బాలాజీ లాబ్స్‌లో డ్రగ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.

అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారా? ఎవరెవరితో సబంధాలు ఉన్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు.

English summary
Hyderabad police have busted drug rocket at jeedimetla and arrested six persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X