• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రంక్ అండ్ డ్రైవ్: కారుతో పోలీసును ఢీకొట్టి బీటెక్ విద్యార్థి బీభత్సం(వీడియో)

|

తూర్పుగోదావరి: మద్యం మత్తులో ఓ విద్యార్థి ఇష్టానురీతిగా కారు నడిపి కాకినాడలో బీభత్సం సృష్టించాడు. అడ్డొచ్చిన పోలీసులను ఢీకొట్టి తప్పించుకోవాలని చూశాడు. అతగాడి వీరంగాన్ని నియంత్రించాలని యత్నించిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని గాయాలతో బయటపడ్డాడు.

కారు నడిపిన విద్యార్థి చేసిన బీభత్సమంతా అక్కడి సీసీకెమెరాలలో స్పష్టంగా రికార్డైంది. వైరల్‌గా ఆ దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ ఘటన ఎస్పీ ఆఫీసు వద్దే చోటు చేసుకోవడం గమనార్హం.

 ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోలేదు..

ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోలేదు..

కాకినాడ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండంగికి చెందిన సిద్ద శ్రీనివాస్‌ ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం కాకినాడ ఆర్‌ఎల్‌ గ్రాండ్‌ నుంచి తన ఆల్టో కారులో బయల్దేరాడు. రాయల్‌ పార్కు హోటల్‌ వద్దకు చేరేసరికి ట్రాఫిక్‌ నియమాలను అతిక్రమించడంతో పోలీసులు ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు.

మితిమీరిన వేగం

మితిమీరిన వేగం

కానీ, ఆ విద్యార్థి కారు ఆపకుండా ముందుకు సాగుతూ మితిమీరిన వేగాన్ని అందుకున్నాడు. దీంతో ఇతర ట్రాఫిక్‌ బీట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆ కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనాలతో వెంబడించారు.

పోలీసులు అడ్డుకున్నా..

పోలీసులు అడ్డుకున్నా..

అయినా, రెండు ట్రాఫిక్‌ బీట్లను ఛేదించుకుంటూ అతడు దూసుకెళ్లాడు. దీంతో పోలీసు సిబ్బంది జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అతడిని నిలువరించేందుకు ముగ్గురు ట్రాఫిక్‌ సిబ్బంది ప్రయత్నించగా వారిని ఢీకొని దూసుకెళ్లేందుకు యత్నించాడు.

హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారీ..

హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారీ..

కాకినాడ నుంచి ఉప్పాడ కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తించేందుకు బయల్దేరిన హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బారికేడ్లు పెట్టి కారును నిలువరించేందుకు యత్నించారు. కానీ, మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్.. దారుణంగా హెడ్‌ కానిస్టేబుల్‌ను ఢీకొంటూ తన కారును పోనిచ్చాడు. దీంతో హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌కు గాయాలయ్యాయి. వాహనం పక్కకు పడటంతో అతనికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

వెంటాడి అదుపులోకి తీసుకున్న పోలీసులు

వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వెంటాడి శ్రీనివాస్‌ కారును నియంత్రించగలిగారు. అతడిని అదుపులోకి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. తొలుత జిల్లా ఎస్పీ దృష్టికి విషయం వెళ్లగా ఆయన ఘటన జరిగిన తీరును సీసీ టీవీ ఫుటేజిలలో పరిశీలించి నిందితుడిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడైన విద్యార్థిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

Video courtesy: The News Minute

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a horrific incident in Kakinada city of East Godavari district, a college student rammed his car into traffic policemen at SP Office on Sunday evening, severely injuring a head constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more