వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రంక్ అండ్ డ్రైవ్: పోలీసును కారుతో తొక్కించిన బీటెక్ విద్యార్థి అరెస్టు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కాకినాడలో కారుతో బీభత్సం సృష్టించడంతోపాటు ఓ పోలీసును తొక్కించిన నిందితుడిని పట్టుకున్నారు. గత ఆదివారం మద్యం మత్తులో కారు నడుపుతూ వెళ్తున్న నిందితుడు ఎస్పీ కార్యాలయం ముందు అపినా ఆగలేదు.

అడ్డువచ్చిన పోలీసులను ఢీకొట్టి మరీ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు ఇంజినీరింగ్‌ విద్యార్థి శ్రీనివాస్‌గా గుర్తించారు.

 drunk and drive case: B tech student arrested

నిందితుడిపై హత్యాయత్నంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడికి లైసెన్స్‌కూడా లేదని డీఎస్పీ రవివర్మ తెలిపారు. శ్రీనివాస్ కారుతో సృష్టించిన బీభత్సం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

డ్రంక్ అండ్ డ్రైవ్: కారుతో పోలీసును ఢీకొట్టి బీటెక్ విద్యార్థి బీభత్సం(వీడియో)డ్రంక్ అండ్ డ్రైవ్: కారుతో పోలీసును ఢీకొట్టి బీటెక్ విద్యార్థి బీభత్సం(వీడియో)

గత ఆదివారం కాకినాడ నుంచి ఉప్పాడ కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తించేందుకు బయల్దేరిన హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బారికేడ్లు పెట్టి కారును నిలువరించేందుకు యత్నించారు. కానీ, మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్.. దారుణంగా హెడ్‌ కానిస్టేబుల్‌ను ఢీకొంటూ తన కారును పోనిచ్చాడు. దీంతో హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌కు గాయాలయ్యాయి. వాహనం పక్కకు పడటంతో అతనికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

English summary
A B tech student arrested on Friday in drunk and drive case in Kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X