ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్:లేడీస్ హాస్టల్లో చొరబడ్డ యువకుడు...ఫుల్లుగా తాగి...వీరంగం

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా: ఒంగోలు పట్టణంలోని బాలికల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లో చేసుకున్న ఓ ఘటన సంచలనం సృష్టించింది. అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో భధ్రత ఎంత డొల్లగా ఉంటుందనేది తేటతెల్లం చేసింది.

శనివారం తెల్లవారుఝామున ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఈ బాలికల హాస్టల్ లోకి చొరబడ్డాడు...ఆ తరువాత బాలికల ముందే వికృతంగా ప్రవర్తించాడు. సుమారు అర్థగంట సేపు హాస్టల్ అంతా కలియ దిరుగుతూ వీరంగం సృష్టించాడు. చివరకు విద్యార్థినుల కేకలు అంతకంతకూ ఎక్కవవుతుండటంతో గోడదూకి పారిపోయాడు. ఈ ఘటన చోటుచేసుకున్న సంక్షేమ హాస్టల్ ఒంగోలు టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌ కు సమీపంలోనే ఉండటం గమనార్హం.

'Drunken' Man enters girls hostel in Ongole...

వసతి గృహంలోని విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం...శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది...పరీక్షలు కావడంతో హాస్టల్ లోని బాలికలు
రాత్రిపూట ఎక్కువసేపు చదువుకుంటూనే ఉన్నారు. ఆ తరువాత కొంతమంది పడుకోగా మరికొంతమంది చదువు కొనసాగించారు. హాస్టల్ లోని ఓ గది పక్కనే గోడ ఉంది. ఆ గదిలో 14 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు గోడ దూకి లోపలికి వచ్చి ఈ గది తలుపులు దబదబా బాదాడు. దీంతో తోటి విద్యార్థినులేమో అని తలుపుతీసిన విద్యార్థునలకు ఫుల్లుగా మద్యం సేవించి తూలుతూ ఉన్న ఓ యువకుడు ఎదురుగా కనిపించడంతో భయంతో కేకలు వేసి గదిలోకి పరుగులు తీశారు.

దీంతో ఆ తాగుబోతు తలుపులు తోసి లోపలికి ప్రవేశించాడు. ఈ విద్యార్థునుల కేకలు విని మరో మిగిలిన విద్యార్థినులు 20 మంది ఆ రూమ్ వద్దకు వచ్చినా ఆ తాగుబోతును చూస్తూ కేకలు వేయడం మినహా ఏమీ చేయలేకపోయారు. విద్యార్థినులు భయపడటం చూసిన ఆ తాగుబోతు మరింత రెచ్చిపోయి అక్కడే ఉన్న వాటర్ జగ్ తీసుకొని వారి ఎదురుగా వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాలికలు కేకలు వేస్తున్నా అర్థరాత్రి కావడం వలనో..భయపడో ఎవరూ రాలేదు.ఇలా అర్థగంట పాటు ఆ యువకుడు హాస్టల్ గది అంతా కలియదిరుగుతూ వీరంగం వేసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు.

ఆ తరువాత విద్యార్థినుల కేకలు అంతకంతకూ అధికమవుతుండటంతో అప్పటికే కొంచెం మత్తు దిగిన ఆ యువకుడు మళ్లీ గోడ దూకి పారిపోయినట్లు తెలిసింది.
ఈ వసతి గృహం వద్ద రాత్రి మహిళా వాచ్‌మన్‌ కాపలాగా కూడా ఉంది. అయితే ఆమె నిద్రపోవడం, విద్యార్థినులు కేకలు వేసినా మెలకువ రాకపోవడంతో... విద్యార్థినులు హాస్టల్‌ వార్డన్‌కు ఫోన్‌ చేశారు. ఆమె కూడా ఫోన్ తీయలేదు. దీంతో బాలికలు డయల్ 100కు కాల్‌ చేయడంతో పోలీసులు 10 నిమిషాల్లోపే హాస్టల్‌ అడ్రస్‌ కనుక్కుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఏబీఎం కళాశాల ఆవరణలో తిరుగుతున్న ఆ యువకుడ్నిపోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతడు ఒరిస్సాకు చెందిన వాడిగా గుర్తించారు.

ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే...ఈ యువకుడు అంతకుముందే ఇలా అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో నైట్ గస్తీ విధుల్లో ఉన్న కొండపి ఎస్సై ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిసింది. అయితే అక్కడ సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ కొద్దిసేపటి తరువాత ఆ యువకుడ్నివదిలేశాడు. అలా వదిలిన తరువాతే ఆ యువకుడు బాలికల వసతి గృహంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటన గురించి ఫోన్ ద్వారా తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తెల్లవారే సరికి బాలికల వసతి గృహం వద్దకు చేరుకున్నారు. వసతి గృహంలో యువకుడి చొరబాటుపై తీవ్ర భయాందోళలను వ్యక్తం చేయడంతో పాటు హాస్టల్ లో భద్రత గురించి ప్రశ్నించారు. పిల్లలను చదివించుకునే స్తోమత లేకున్నాసరైన భద్రత లేని చోట ఉంచే కంటే చదువు మానేసినా పరవాలేదన్నారు. వసతి గృహం ప్రైవేటు భవనంలో నిర్వహిస్తూ భద్రతా చర్యలు తీసుకోకపోవడం అధికారుల ఘోర వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటన సమాచారం తెలుసుకున్న టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌రెడ్డి ,ఏఎస్‌డబ్ల్యూఓ యు.జోజయ్య వసతి గృహాన్ని పరిశీలించి హాస్టల్‌వార్డెన్‌ రాధను విచారించారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని, ప్రహరీ చుట్టూ ఫెన్సింగ్‌ వేయిస్తామని, బీట్‌ కాని స్టేబుళ్లతో నిరంతరం గస్తీ ఏర్పాటు చేయిస్తామని...విద్యార్థినులు భయపడాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు.

English summary
Ongole: A Orissa Young man was entered in a ladies hostel supposedly in a drunken state and behaved indecently. This incident was held at the government girls' welfare hostel in Ongole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X