వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదోడి అన్నం ఆగిపోయింది: మాట త‌ప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం: మూత‌బ‌డిన అన్నా క్యాంటీన్లు..!

|
Google Oneindia TeluguNews

పేదోడి క‌డుపు కొట్టే ఉద్దేశం లేదు..నాలుగు రోజుల క్రితం శాస‌న‌స‌భా వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ ఇది. ఏపీలో అన్నా క్యాంటీన్ల‌ను మూసివేసే ఉద్దేశం లేద‌ని..అయితే ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఊహించిందే జ‌రిగిం ది. అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మూత బ‌డ్డాయి. రాజ‌కీయాలు ఎలా ఉన్నా..ప్ర‌త్యామ్నాయాలు చూడ‌కుండా ఇంత తొంద‌ర‌పాటు నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారుతోంది. అన్నా క్యాంటీన్ల‌కు రంగు మారిస్తే.. వాటిని మూసివేస్త‌న్న‌ట్లా అని ప్ర‌భుత్వం ప్ర‌శ్నించింది. ఇప్పుడు చేసిందేంటి. అయితే, త్వ‌ర‌లోనే వీటిని ప్రారంభిస్తామ‌ని.. విధి విధానాలు ఖ‌రారు చేస్తామ‌ని చెబుతోంది. మ‌రి..అప్ప‌టి వ‌ర‌కు పేదోడి క‌డుపు ఎక్క‌డ నిండాలి...

అన్నా క్యాంటీన్లు మూసివేత‌..
త‌మ ప్ర‌భుత్వం మాన‌వీయ‌త ఉన్న గ‌వ‌ర్నమెంట్ అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌ర్వంగా చెప్పారు. కానీ, ఇప్పుడు పేదోడు క‌డుపు నింపుకొనే అన్నా క్యాంటీన్లు మూసివేయ‌టం పైన పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌నే కార‌ణంతో వీటిని మూసివేసారా..లేక నిజంగా మంత్రులు చెబుతున్న‌ట్లుగా అవినీతి జ‌రిగిందా అనేది తేలాల్సిన విష‌యం. ప్ర‌భుత్వం కార‌ణం ఏదైనా వీటిని మూయాల‌ని నిర్ణ‌యించినా..లేక ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా..ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఎక్క‌డా అటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు, అన్న క్యాంటీన్ల‌కు ఆహారం స‌ర‌ఫ‌రా చేస్తున్న అక్ష‌య సంస్థ‌తో ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పంద గ‌డువు ముగిసింది. దీని పైన కాంట్రాక్టు పొడిగింపు పైన ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. క‌నీసం చ‌ర్చ‌లు చేయలేదు. అన్నా క్యాంటీన్లు గ‌త ప్ర‌భుత్వంలో ప‌సుపు రంగుతో ఏర్పాటు చేస్తే...వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వాటికి తెల్ల రంగు వేసారు. అదే స‌మ‌యంలో క్యాంటీన్లు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఏర్పాటు చేసార‌ని..పూర్తి స్థాయిలో ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని స‌భా వేదిక‌గా మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు.

Recommended Video

అన్న క్యాంటీన్ల కొనసాగింపు పై అపోహలు వద్దు: మంత్రి బొత్స
Due To AP Govt negligence Anna Canteens closed in around 13 districts in AP.

మూయ‌మ‌ని చెప్పారు..మూత‌బ‌డినాయి
అసెంబ్లీలో ఇదే అన్నా క్యాంటీన్ల గురించి చ‌ర్చ జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం చాలా స్ప‌ష్టంగా అన్నా క్యాంటీన్ల‌ను మూసివేసే ఆలోచ‌న లేద‌ని ప్ర‌క‌టించింది. ఇందులో అవినీతి జ‌రిగింద‌ని కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇప్పుడు ప్ర‌భుత్వం నుండి క్యాంటీన్లు మూసివేత మీద ఎటువంటి వివ‌ర‌ణ రాలేదు. అయితే, అధికారులు చెబుతున్న స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం ఏపీలో 183 అన్నా క్యాంటీన్లు ఉన్నాయ‌ని..వాటిని కొన్ని చోట్ల అవి ఉన్న ప్రాంతాల‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అన్నింటికి రాజ‌న్న క్యాంటీన్ల పేరుతో కొన‌సాగించే విధంగా ప‌రశీల‌న జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల పాటు వేచి ఉండాలని ఆహార ప‌దార్ధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న అక్ష‌య సంస్థ‌కు ప్ర‌భుత్వం సూచ‌న చేసిన‌ట్లు స‌మాచారం. ఇదంతా త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌ని చెబుతున్నా .. ఇప్ప‌టి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌య‌మే లేద‌ని స‌మాచారం. దీంతో..మ‌రి అప్ప‌టి వ‌ర‌కు పేద‌వాడు క‌డుపు ఎక్క‌డ నింపు కోవాలో ప్ర‌భుత్వ‌మే స‌మాధానం చెప్పాలి. వారి ఆక‌లి తీర్చేదెవ‌రో ముఖ్య‌మంత్రి చెప్ప‌గ‌ల‌రా.

English summary
Due To AP Govt negligence Anna Canteens closed in around 13 districts in AP. four days ago Govt assured on continue of Anna Canteens. But, now totally closed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X