వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల మాఫీ: యూనివ‌ర్స‌ల్ హెల్త్ కార్డులు: జీవిత భీమా : జ‌గన్ మేనిఫెస్టో..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల మాఫీ.. వైసిపి మేనిఫెస్టో..! || Oneindia Telugu

వైసిపి అధినేత జ‌గ‌న్ త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసారు. న‌వ‌ర‌త్నాల తో పాటుగా పాద‌యాత్ర స‌మ‌యం లో ఇచ్చిన హామీల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. డ్వాక్రా మ‌హిళా సంఘాల రుణాల‌ను నాలుగు విడ‌త‌ల్లో మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వేయి రూపాయాలు దాటిని వైద్యానికి యూనివ‌ర్స‌ల్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టిం చారు. ఉచిత విద్యుత్..బిసి డిక్ల‌రేష‌న్ హామీల అమ‌లుకు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు.

డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల మాఫీ..

డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల మాఫీ..

జ‌గ‌న్ పార్టీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన న‌వ ర‌త్నాల‌కు ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్రాధాన్య‌త ఇచ్చారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టిం చిన మేనిఫెస్టోలోని హామీల‌ను అమ‌లు చేసి..2024 లో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తీ రైతుకు సంవ‌త్స రానికి 12,500 చొప్పున అందిస్తామ‌న్నారు. రైతుల‌కు వ‌డ్డీ లేని పంట రుణాలు ఇస్తామ‌ని..పంట భీమా ప్ర‌భుత్వ‌మే క‌డు తామ‌ని చెప్పుకొచ్చారు. ప‌గ‌టి పూటే 9 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్నారు. మూడు వేల కోట్ల‌తో పంట స్థిరీక‌ర‌ణ నిధి ..నాలుగు వేల కోట్ల‌తో ప్ర‌కృతి విప‌త్తుల స‌హాయ నిధి ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆక‌స్మికంగా మ‌ర‌ణించిన రైతు ల‌కు ఏడు ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. కౌలు రైతుల‌కు అన్ని హామీలు అమ‌లు చేస్తామ‌న్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఎన్నిక‌ల స‌మ‌యానికి ఉన్న మొత్తం రుణాన్ని నాలుగు విడ‌త‌లుగా మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

యూనివ‌ర్స‌ల్ హెల్త్ కార్డులు..

యూనివ‌ర్స‌ల్ హెల్త్ కార్డులు..

వైయ‌స్సార్ ఆరోగ్య శ్రీ ప‌ధ‌కం ద్వారా సాలీనా 5 లక్ష‌ల ఆదాయం లోపు ఉన్న ప్రతీ ఒక్క‌రికి ..వేయి రూపాయ‌లు వైద్య ఖ‌ర్చులు దాటితే వారిని ఆరోగ్య శ్రీ కింద‌కు తీసుకొస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఎక్క‌డ వైద్యం చేయించుకున్నా..ఎంత ఖ‌ర్చు అయినా ప్ర‌భుత్వ‌మే భరిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఆప‌రేష‌న్ చేయించుకున్న వారు విశ్రాంతిలో ఉంటే వారికి ఆర్దిక సాయం అందిస్తామ‌న్నారు. రెండేళ్ల‌లో ఏపిలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను కార్పోరేట్ ఆస్ప‌త్రుల‌కు ధీటుగా తీర్చి దిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. అమ్మ ఒడి కింద ప్ర‌తీ త‌ల్లికి ద‌శ‌ల వారీగా 75 వేలు చెల్లిస్తామ‌న్నారు. పేద‌లంద‌రికీ ఇళ్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. పోల‌వ‌రం తో స‌హా జ‌ల‌య‌జ్ఞం కింద ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేస్తామ‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధిస్తాం..యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని.. ప్ర‌తీ ఏటా జ‌న‌వ‌రి లో భ‌ర్తీ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. గ్రామ స‌చివాల‌యాల ద్వారా ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు.

పెన్ష‌న్ల వ‌య‌సు త‌గ్గింపు..

పెన్ష‌న్ల వ‌య‌సు త‌గ్గింపు..

పెన్ష‌న్లు పొందే వారి వ‌య‌సును ప్ర‌స్తుతం ఉన్న 65 ఏళ్ల నుండి 60 ఏళ్ల‌కు త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా వృ ద్దాప్య పెన్ష‌న్ల‌ను రెండు వేల నుండి మూడు వేల వ‌ర‌కు పెంచుతామ‌న్నారు. విద్యార్దుల‌కు ఫీజు రీ యంబ‌ర్స్‌మెంట్ అమ‌లు చేస్తామ‌న్నారు. మూడు ద‌శ‌ల్లో మ‌ధ్య‌పాన నిషేధం అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.అగ్రిగోల్డ్ బాధితుల‌కు 1150 కోట్లు చెల్లిస్తామ‌న్నారు. 18 నుండి 60 ఏళ్ల లోగా ఎవ‌రు మ‌ర‌ణించినా వారికి ల‌క్ష రూపాయాల భీమా చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక పోలీసు ఉద్యోగులకు వారాంత‌పు సెల‌వు ఇస్తామ‌న్నారు. ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి తో పాటుగా త్వ‌ర‌లో పీఆర్‌సి అమ‌లు చేస్తామ‌న్నారు. కాపు కార్పోరేష‌న్ ద్వారా ప్ర‌తీ ఏటా రెండు వేల కోట్లు ఖ‌ర్చు చేస్తా మ‌ని..బిసిల‌కు న‌ష్టం లేకుండా కాపు రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అగ్ర కులాల కోసం ప్ర‌త్యేక కార్పోరేష‌న్లు ఏర్పాటు చేస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు.

English summary
YCP Chief Jagan released Party election manifesto. given priority for Navaratnalu and also padayatra assurances. announ ced DWACRA members loan wavier and universal health cards. Implementation of BC Declaration decisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X