వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ద్వివేదీ కౌంటర్..! ఈసీ ఎవరికీ కొమ్ము కాయదని స్పస్టీకరణ..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Elections 2019 : చంద్రబాబుకు ద్వివేదీ కౌంటర్..! || Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత జగన్ తో కలిసి ప్రధాని మోడీ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీకి బుధవారం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. జగన్ ఏది చెప్తే అది చేయాలని ఎన్నికల అధికారులకు మోదీ చెప్పారని ఆరోపించారు. ఇప్పటికీ హైదరాబాద్ లోనే జగన్ మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావుల తో కుట్రలు పన్నుతున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి సీఈవోను కలవడం ఇదే మొదటి సారని అన్నారు. 22రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి వీవీప్యాట్ లను కౌంట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఎలక్షన్ కమిషన్ స్లిప్ లను లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని ఎన్నికల అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు.

Dwivedi counter for Babu..!EC has selfrespect says Dwivedi..!!

ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ద్వివేది వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ కొమ్ము కాయట్లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోంది తప్ప ఏ ఒక్క పార్టీకో సహకరించాలని ఆదేశించడంలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని ద్వివేది పునరుద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల పట్ల రాజకీయ పార్టీగా టీడిపి మరోసారి పునరాలోచించుకోవాలని ద్వివేదీ అభిప్రాయం వ్యక్తం చేసారు.

English summary
Expressing serious condolences on the performance of the Election Commission, Chief Minister Chandrababu Naidu has reportedly accompanied Gopalakrishna Dwivedi. Dwivedi explains it. It is clear that they do not have any hurdle with any party.The Central Election Commission also suggests that it is in accordance with the provisions of the Code and not to co-operate with any of the parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X