వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని ప్రభుత్వ సేవలకు ఒక సరికొత్త వేదిక... "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌": సిఎం చంద్రబాబుచే ఆవిష్కరణ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇకపై అన్ని ప్రభుత్వ సేవలకు ఒకే వేదిక

అమరావతి:ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు అన్ని శాఖల పనులు ఒకే చోట, అదీ నిమిషాల వ్యవధిలో ఆ పనులు పూర్తయ్యేలాగా ఒక వేదిక "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" అనే సరికొత్త వ్యవస్థను ఎపి ప్రభుత్వం సిద్దం చేసింది.

ప్రజలకు సంతృప్తికర సేవలు అందించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెండేళ్ల కసరత్తు అనంతరం తుది రూపు దిద్దుకొని సేవలకు సిద్దమైన "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" ను సిఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ ప్రగతి...అవకాశాలు

ఈ ప్రగతి...అవకాశాలు

ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌ ద్వారా ప్రభుత్వం లోని అన్ని శాఖలు, విభాగాల సేవలను ఒకేచోట పొందే అవకాశం లభిస్తుంది. 33 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 180 రకాల ధ్రువపత్రాలు, లైసెన్సులు, అనుమతులు దీనిలో పొందవచ్చు. రెవెన్యూ, పర్యాటకం, రవాణా, పంచాయతీరాజ్‌...ఇలా ఏ శాఖలో పని అయినా ఒకే పోర్టల్‌ నుంచి చేసుకోవచ్చు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పోర్టల్ ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు సమారు రెండేళ్లు సమయం పట్టగా దీని రూపకల్పనలో ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, ఇ-ప్రగతి సీఈవో బాలసుబ్రమణ్యం తదితరులు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.

మై ఏపీ పోర్టల్‌...ఏం చేస్తారంటే?...

మై ఏపీ పోర్టల్‌...ఏం చేస్తారంటే?...

తొలిదశలో విద్య, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటకం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, క్రీడల శాఖలను ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌ పరిధిలోకి తెస్తున్నారు. దశల వారీగా ప్రభుత్వంలోని 34 శాఖల అనుసంధానం జరుగుతుంది. దీనికోసం ప్రభుత్వం ఒక సరికొత్త యాప్‌ స్టోర్‌ను కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఇప్పటికే ఆన్‌లైన్‌ సేవల కోసం రూపొందించిన యాప్‌లను ఇందులో ఉంచుతారు. దాదాపు 100 యాప్‌లు ఈ స్టోర్‌లో ఉంటాయి. అలాగే ప్రభుత్వ పరంగా అందించే సేవలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ఈ పోర్టల్ ద్వారా లభిస్తుంది

ఈ సౌలభ్యాలు...కూడా

ఈ సౌలభ్యాలు...కూడా

అలాగే అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి అత్యుత్తమ నిర్ణయం తీసుకునే సౌలభ్యం కూడా ఈ-ప్రగతిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శాఖలో ఒక్కో అంశానికి సంబంధించి టన్నుల కొద్దీ సమాచారం ఉంటుంది. అయితే దాన్ని మాన్యువల్‌గా విశ్లేషణ చేయడం దాదాపు అసాధ్యం. ఈ-ప్రగతిలో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవచ్చు కాగిత రహిత పాలనకు కూడా ఇది దోహదపడనుంది. అవసరమైన అన్ని ధ్రువపత్రాలను ప్రింట్‌ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా కావాల్సిన సేవకు అనుసంధానం చేసుకోవచ్చు.

సిఎం చంద్రబాబు...ఏం చెప్పారంటే?

సిఎం చంద్రబాబు...ఏం చెప్పారంటే?

"ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" ద్వారా డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా ఎపి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం చంద్రబాబు చెప్పారు. క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో ఈ-ప్రగతి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.ఒకే వేదికగా ఈ-ప్రగతి ద్వారా 5 ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. డిజిటల్‌ పారదర్శకత ప్రాజెక్టులో భాగంగా 33 శాఖల సేవలు అందుతాయన్నారు. "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" గా నామకరణం చేసిన ఈ పోర్టల్ కు ‘ఒకే ప్రభుత్వం-ఒకే పోర్టల్‌' అనే ట్యాగ్ లైన్ చేర్చారు.

English summary
Amaravati: The AP Government has prepared a single platform called "E-Pragati-my AP Portal" to facilitate all the works of all government departments in one place, within minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X