ఏపీలో ఎన్నికలు ఎప్పుడు : పీకే తో బంధం - ప్రజల్లోకి ముఖ్యమంత్రి : సీఎం జగన్ నేడు కీలక భేటీ..!!
ఏపీ లో ఎన్నికలు ముందస్తుగా రానున్నాయా. పీకే - వైసీపీ బంధం కొనసాగుతుందా. సీఎం జగన్ ఆలోచనలు - ప్రణాళికలు ఏంటి. ఏం చేయబోతున్నారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో స్పష్టత ఇస్తారా. ఈ రోజు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు ప్రారంభించిన జగన్ ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు భవిష్యత్ పైన దిశా నిర్దేశం చేయనున్నారు.

ఎన్నికల టీంకు సీఎం దిశా నిర్దేశం
మంత్రులు..పార్టీ జిల్లా బాధ్యులు..సమన్వయర్తల మధ్య కో ఆర్డినేషన్ - ప్రభుత్వం - పార్టీ లక్ష్యాలను సీఎం జగన్ పార్టీ నేతల ముందు ఉంచనున్నారు. పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో ఉమ్మడిగా ముందుకేళ్లే అవసరాన్ని జగన్ వివరించనున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ - ప్రభుత్వం పైన పలు రకాల సర్వేల ద్వారా సీఎం జగన్ సేకరించారు.
అందులో ప్రభుత్వం - పథకాల నిర్వహణ పైన పాజిటివ్ గా నివేదికలు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో కొందరు పార్టీ నేతలు..ఎమ్మెల్యేల తీరు పైన భిన్నంగా వచ్చినట్లు చెబుున్నారు. దీంతో..పార్టీ పరిస్థితిని వివరిస్తూ.. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తూ..ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ...ముందుకు వెళ్లటం పైన సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

సూచనలు - హెచ్చరికలు
కొత్త మంత్రులతో తాజా మాజీ మంత్రులు పొసగకపోవడం వంటి సమస్యలు కొన్ని చోట్ల ఉన్నాయి. వీటిపైనా సీఎం జగన్ సూచనలిస్తారని తెలిసింది. ఇక, వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడప కు వైసీపీ ప్రారంభం పైన క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం రెండు నెలల పాటు నిర్వహించనున్నారు.
వేసవిలొ సమస్యలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయని ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లటం పైన పార్టీలో కొందరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, సమస్యలు ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్లాలని సీఎం వారికి స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక, ఏపీలో పార్టీతోపాటు పార్టీ అనుబంధ విభాగాలు కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం.

ఇక ప్రజల్లోకి సీఎం జగన్
ఏపీలో షెడ్యూల్ ప్రకారం 2024 లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ముందస్తు ఎన్నికలు తప్పవనే విధంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ..తెలుగు రాజకీయాల్లోనూ కీలకంగా మారిన ప్రశాంత్ కిషోర్ తో వైసీపీ సంబంధాల పైన సీఎం జగన్ ఈ సమావేశంలో స్పష్టత ఇస్తారని అంచనా వేస్తున్నారు. అటు కాంగ్రెస్... ఇటు టీఆర్ఎస్ తోనూ పీకే సన్నిహితంగా ఉంటున్న సమయంలో..ఆయనతో ఏ రకంగా వ్యవహరించాలనే దాని పైన సీఎం జగన్ ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ తో సంబంధాల పైనా క్లారిటీ
ఇదే సమయంలో...వైసీపీ కోసం థర్డ్ పార్టీ సంస్థ సేవలను మాత్రం వినియోగించుకోవాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఐ ప్యాక్ సేవలు మాత్రం వైసీపీ వినియోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పైన సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, సీఎం జగన్ సైం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీని పైన తన పర్యటనల పైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో...ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ నిర్వహించబోయే సమావేశం రాజకీయంగా కీలకంగా మారుతోంది. జగన్ ఏం చెబుతారనే అంశం పైన ఆసక్తి కనిపిస్తోంది.