తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. కృష్ణా,నల్గొండ జిల్లాలలో .. కారణం ఇదే !!
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల కూడా పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు టెన్షన్ పుట్టిస్తోంది.
కరోనాకు పతంజలి మందు విడుదల చేసిన రాం దేవ్ బాబా.. మూడు రోజుల్లోనే వ్యాధి నయమట..!

కృష్ణా జిల్లా ముక్త్యాలలో భూప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముక్త్యాల గ్రామంలో భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలు రావడంతో ఆందోళన పడిన గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 2.2 గా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తుండడంతో ఏపీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు .ఈ నెల జూన్ 5వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు లో భూమి కంపించింది.దీంతో ఒంగోలు వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

నల్గొండ జిల్లాలోనూ కంపిస్తున్న భూమి
ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమి లోపలి పొరల్లో సహజంగా కలిగే కదలికలలో ఏదైనా తేడా వచ్చినప్పుడు భూ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం, మేళ్లచెరువు వంటి ప్రాంతాలలో భూప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు భూకంపం వచ్చే అవకాశం లేదని,ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

భూప్రకంపనలకు రీజన్ ఇదే
ఇక భూప్రకంపనలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాకుండా పర్యావరణానికి జరుగుతున్న అపారమైన నష్టాలు కూడా కారణంగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో రిజర్వాయర్లలో నిల్వ చేసిన అపారమైన జలసంపద, భూగర్భ జలాన్ని దుర్వినియోగం చేయడం, చెట్లను నరకడం, విపరీతంగా పెరిగిపోయిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా బోర్లు వేయడం వంటి అనేక పరిణామాలతో భూమి పొరల లోపల ఒత్తిడి కలిగి, సర్దుబాట్లు జరిగి భూకంపాలకు కారణం అవుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలకు కారణం ఇదే అని తెలుస్తుంది.