వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల వలయంలో కిర్లంపూడి, అడుగడుగునా చెక్‌పోస్టులు

కాపు రిజర్వేషన్ పోరాట సమితి ముద్రగడ పద్మనాభం పాదయాత్రల హెచ్చరికల నేపథ్యంలో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కిర్లంపూడిలో 2 వేల మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ పోరాట సమితి ముద్రగడ పద్మనాభం పాదయాత్రల హెచ్చరికల నేపథ్యంలో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కిర్లంపూడిలో 2 వేల మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.అయితే పాదయాత్రను నిర్వహించి తీరుతామని ముద్రగడ ప్రకటించారు.

దీంతో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకుసిద్దంగా ఉన్నారు. సుమారు 6 వేల మంది పోలీసులను మోహరించారు. కిర్లంపూడిలోనే 2 వేల మంది పహరా కాస్తున్నారు.

ముద్రగడ అనుచరులపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. తూర్పుగోదావరితోపాటు, గుంటూరుజిల్లాలో కూడ పోలీసులు తీవ్ర ఆంక్షలను పెట్టారు.

గుర్తింపుకార్డు ఉంటేనే కిర్లంపూడి గ్రామంలోకి అనుమతిస్తున్నారు.ఎక్కడికక్కడ నిర్భందాలు, తనిఖీలను నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ నెల 26వ, తేదిన ముద్రగడ పాదయాత్రను నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

పోలీసుల వలయంలో కిర్లంపూడి

పోలీసుల వలయంలో కిర్లంపూడి

ఈ నెల 26వ, తేది నుండి రిజర్వేషన్ల సాధన కోసం పాదయాత్రను నిర్వహిస్తామని ముద్రగడ ప్రకటించిన నేపథ్యంలో కిర్లంపూడిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులను పోలీసులు దిగ్భందించారు. ముద్రగడ ఇంటి ముందు పోలీసులు సిసికెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను ఆయన ఇంటిపై తిప్పుడూ అక్కడి పరిస్థితిని రికార్డు చేస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan Seeks Chandrababu Naidu Appointment
పాదయాత్ర చేసి తీరుతాం

పాదయాత్ర చేసి తీరుతాం

ఈ నెల 26వ, తేదిన పాదయాత్ర చేసి తీరుతామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ప్రకటించారు. పాదయాత్ర చేయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుపడడంపై వారు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాపులు నక్సలైట్లా అంటూ వారు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తమ తీరును మార్చుకోవాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కోరుతున్నారు.

కాపునేతలపై నిఘా

కాపునేతలపై నిఘా

ఈ నెల 26వ, తేదిన నిర్వహించే పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో కాపు యువత పెద్ద ఎత్తున పాల్గొనకుండా ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహించారు.అంతేకాదు ఆయా గ్రామాల్లో మఫ్టీల్లో కాపు యువతపై నిఘాను ఏర్పాటుచేశారు. అంతేకాదు ముద్రగడ అనుచరుల కదలికలపై కూడ నిఘాను పెట్టారు.

దారిపొడవునా చెక్‌పోస్టులు

దారిపొడవునా చెక్‌పోస్టులు

కిర్లంపూడికి వెళ్ళే దారితో పాటు గుంటూరుకు వెళ్ళే రహదారిలో చెక్‌‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు 30 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ ను విధించారు. రహదారి పొడవునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి సుమారు 95 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

English summary
East godavari police imposed 144 section in Kirlampudi. 95 checkposts arranged in Guntur and East godavari districts. Ap government did not permit to Mudragada padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X