వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ, 2019లో ఏపీ-తెలంగాణ ఈ గుర్తుపైనే పోటీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ మేరకు శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జనసేన పార్టీకి ఉమ్మడి గుర్తు లభించింది. గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 లోకసభ నియోజకవర్గాలున్నాయి. 2019లో జరగనున్న ఏపీలోని 25 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలలో ఈ గుర్తుపై పోటీ చేస్తుందని ఈసీ తెలిపింది.

EC assigns glass tumbler symbol to Jana Sena party

2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. పార్లమెంటు సాధారణ ఎన్నికలతోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుంది. ఈ ఎన్నికల గుర్తు అప్పుడే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

English summary
It is said that Election Commission assigned symbol to Jana Sena Party. Janasena was assigned Glass symbol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X