వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ క్యాబినెట్ భేటీకి అనుమతి ఓకే కానీ కండీషన్స్ అప్లై అంటున్న సీఈసీ

|
Google Oneindia TeluguNews

ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమీషన్ నుంచి అనుమతి లభించింది. అయితే పలు ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ భేటీపై సీఈసి పెట్టిన కండీషన్స్ పై చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ కండీషన్స్ ఏంటంటే

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గ ఎజెండాకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. తాగునీరు, సాగునీరు, ఫొణి తుఫాను, కరువు అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఇక వీటితో పాటు కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది.

నంద్యాల‌..క‌ర్నూలు సీట్లు మ‌నవే : చ‌ంద్ర‌బాబు ధీమా: టీడీపీ నేత‌లు..వైసీపీ మాత్రం ఇలా..!నంద్యాల‌..క‌ర్నూలు సీట్లు మ‌నవే : చ‌ంద్ర‌బాబు ధీమా: టీడీపీ నేత‌లు..వైసీపీ మాత్రం ఇలా..!

 EC gives conditional nod to AP cabinet meet

ఒకవేళ బకాయిల చెల్లింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈసీ అనుమతి తర్వాత అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా కేబినెట్‌ భేటీ అనంతరం నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. మరిచూడాలి ఇన్ని ఆంక్షలతో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎలాంటి అంశాలు నేడు చర్చకు రానున్నాయో.

English summary
Uncertainty over conduct of the State Cabinet meeting on Tuesday (May 14) ended with the Election Commission of India (ECI) granting permission.The ECI stated on Monday evening that it had no objection over the convening of the meeting of the Council of Ministers, subject to certain conditions.The conditions, according to ECI spokesperson Sheyphali Saran, were any new decisions or revision of rates or any outstanding payment would require the permission of the Commission. The ECI also made it clear that there should not be any media announcement regarding enhancement of rates, etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X