వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శోభా నాగిరెడ్డి వారసులెవరు?: గెలుస్తామన్న భూమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

EC keeps Shobha Nagireddy's name in candidates list
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, ఆ పార్టీకి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి కీలక నేత అయిన శోభా నాగిరెడ్డి అకాల మృతితో ఇప్పుడు ఆ పార్ట వారసులు ఎవరనే చర్చ సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోను ఎన్నికలు యథావిధిగా జరుగుతాయి.

ఎన్నికల అనంతరం శోభాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమెను గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప ఎన్నిక జరుపుతారు. ఈ క్రమంలో శోభా నాగిరెడ్డి వారసులు ఎవరు అనే చర్చ సాగుతోంది.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పదిమందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో శోభా నాగిరెడ్డికి మద్దతుగా అనుచరులైన భూమా బ్రహ్మానంద రెడ్డి, సింగం వెంకటేశ్వర రెడ్డి, దస్తగిరి రెడ్డి స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బ్రహ్మానంద రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోగా, వెంకటేశ్వ రెడ్డి, దస్తగిరి రెడ్డి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇస్తుందా లేక శోభా నాగిరెడ్డిని గెలిపిస్తుందా చూడాలి.

శోభా గెలుస్తారు: భూమా నాగిరెడ్డి

తన భార్య శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పటికీ.. ఆమె ప్రజల గుండెల్లో ఉందని, ఆమెను గెలిపిస్తారని భూమా నాగిరెడ్డి అన్నారు. శోభా ఒక లక్ష మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. ఉప ఎన్నికల్లోను తాము అదే మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
By a strange quirk of rules, YSR Congress’ Allagadda candidate B. Shoba Nagi Reddy, who died on Thursday in a car crash, will be counted as a candidate for the April 30 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X