వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 'ఒక్క నిర్ణయం' నుంచి పవన్ కళ్యాణ్ బయటపడేనా!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఈసీ గుర్తింపు దక్కించుకున్న జనసేనకు, రెండు రోజుల క్రితమే ఏపీలోను గుర్తింపు వచ్చింది.

ఇంకా గుర్తు మాత్రం రాలేదు. పార్టీకి రెండు రాష్ట్రాల్లో గుర్తించి వచ్చినందున తెలంగాణ, ఏపీలలో జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, తెలంగాణ కంటే ఏపీ పైనే పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి సారించే అవకాశముందని అంటున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్‌కు ఆవేశం, ఆక్రోశం ఎక్కువే. ప్రజలకు ఏదో చేయాలనే తపనే అయినప్పటికీ రాజకీయాల్లో ఆవేశం పనికి రాదని అంటుంటారు. 2019 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సిద్ధమవడం, ఆయన పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను గుర్తింపు వచ్చినందున జనసేనపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవి చేసినటువంటి కీలక పొరపాట్లు చేయకుంటేనే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరని అంటున్నారు. గతంలో వారు చేసిన కీలక పొరపాట్ల వల్ల మహామహులే ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి సందర్భాల్లో రాజకీయాల్లోకి వచ్చే పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమైనదని, 'ఒక్క నిర్ణయం'లో పొరపాటు జరిగినా అది ఎదురు తిరుగుతుందని అంటున్నారు. 1983లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని రావడం రావడమే మట్టి కరిపించిన ఎన్టీఆర్... 1989లో ఘోర ఓటమి చవి చూశారు.

నాయకులు తీసుకునే కొన్ని లేదా ఒకటి రెండు కీలక నిర్ణయాలు కూడా పార్టీని ఇబ్బందులకు గురి చేస్తాయని అంటున్నారు. హైటెక్ సీఎంగా పేరుగాంచిన చంద్రబాబు 2004లో ఘోర ఓటమి చవి చూశారు. దానికి అన్నదాతల ఆగ్రహం, ఉద్యోగుల ఆగ్రహం అనే వాదన ఉంది.

EC Recognizes Janasena, Symbol Not Allotted

2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి.. 2009 ఎన్నికల్లో మంచి సీట్లు సాధించకున్న ఓట్ షేర్ మాత్రం బాగా సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లోనైనా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చాలామంది భావించారు. కానీ అంతలోనే 2011లో చిరు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం చిరంజీవి చేసిన పెద్ద రాజకీయ పొరపాటుగా చాలామంది భావిస్తారు. ఇక, వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారు అనే వాదన కూడా ఉంది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసులు ఎదుర్కొంటున్నారు.

ప్రజలకు ఏదో చేయాలనే తపన, ఆవేశంతో పాటు రాజకీయ చతురత కూడా చాలా ముఖ్యమని, పవన్ కళ్యాణ్‌కు రాజకీయ కుతంత్రాలు తెలియక పోవడం మైనస్ అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏ ఒక్క నిర్ణయం పొరపాటుగా తీసుకున్న పార్టీకి నష్టమేనని అంటున్నారు. పోటీ చేస్తానని పవన్ ప్రకటించడం, పార్టీకి గుర్తింపు వచ్చినందున అప్పుడే జనసేన పైన అంచనాలు, చర్చలు జరుగుతున్నాయి.

English summary
EC Recognizes Janasena, Symbol Not Allotted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X