వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మొత్తం 3.99 లక్షల ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఈసీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394 మందిగా తేలింది. అదులో పురుష ఓటర్లు కోటీ 97 లక్షల 21 వేల 514 కాగా.. మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది అని వెల్లడైంది.

ఎన్‌ఆర్‌ఐ, ట్రాన్స్‌జెండర్లు..
సవరించిన ఓటర్ల జాబితాలో విడివిడిగా పురుషులు, మహిళల సంఖ్యతోపాటు ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్యను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏపీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 4,066గా నమోదైంది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,436 ఉన్నారని ఈసీ తెలిపింది. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా లక్షా 63 వేల 30 మంది ఓటర్లు నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వెల్లడించారు.

EC releases final list of voters in Andhra Pradesh, number is above 3.99 crore

పకడ్బందీ ఏర్పాటలు..
మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం 45,836 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విజయానంద్ తెలిపారు. అటు రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో తనమునకలయ్యాయి.

English summary
State Election Commission releases final list of voters in Andhra Pradesh. there are above 3.99 crore of voters eligible to cast their vote
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X