అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి, ఈఎస్ఐ, అగ్రిగోల్డ్ స్కాంలపై ఈడీ దర్యాప్తు- అసెంబ్లీ వేళ టీడీపీకి ముచ్చెమటలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని పేరుతో చోటు చేసుకున్న భూముల అక్రమాలపై ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. నిన్న సాయంత్రమే విజయవాడ చేరుకున్న ఈడీ బృందాలు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అన్నిశాఖల అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ఈడీ దర్యాప్తు విపక్ష టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

 ఏపీ అసెంబ్లీ: రూటు మార్చిన టీడీపీ: బలం లేని చోట బాయ్‌కాట్: మెజారిటీ ఉన్న చోట సత్తా చాటేలా ఏపీ అసెంబ్లీ: రూటు మార్చిన టీడీపీ: బలం లేని చోట బాయ్‌కాట్: మెజారిటీ ఉన్న చోట సత్తా చాటేలా

 అమరావతిపై ఈడీ దర్యాప్తు...

అమరావతిపై ఈడీ దర్యాప్తు...

గత టీడీపీ హయాంలో అమరావతిలో రాజధాని వస్తుందని ముందుగా పార్టీ నేతలకు లీకులిచ్చి బినామీ పేర్లతో భూములు కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సేకరించిన వివరాల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. సీఐడీ దర్యాప్తులో 700 మంది తెల్ల రేషన్ కార్డు దారుల పేరుతో భూములను కొల్లగొట్టాలని గుర్తించారు. దీంతో ముందుగా ఈ వ్యవహారంపై సీఆర్డీయే అధికారుల నుంచి ఈడీ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి.

 అమరావతిలో లబ్ది దారులెవరు ?

అమరావతిలో లబ్ది దారులెవరు ?

అదే సమయంలో సదరు భూముల రిజిస్టేషన్లకు సంబంధించి ల్యాండ్‌ పూలింగ్‌లో రిటర్నబుల్‌ ప్లాట్లు దక్కించుకున్నది ఎవరు? వాటిని ఎవరికి విక్రయించారు? తదితర వివరాలపై సీఐడీతో పాటు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, సీఆర్‌డీఏ అధికారులతో నాగార్జున యూనివర్సిటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా సీఐడీ అధికారులు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఈడీ వారి నుంచి సేకరించడంతో పాటు దాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. ఓసారి ఈ డేటాపై అవగాహన వచ్చాక తదుపరి అంశాలపై దృష్టిసారిస్తారు.

 ఈఎస్ఐ స్కాం, అగ్రిగోల్డ్ పైనా...

ఈఎస్ఐ స్కాం, అగ్రిగోల్డ్ పైనా...

అమరావతి భూముల స్కాంపై దర్యాప్తు కోసం విజయవాడ వచ్చిన నాలుగు ఈడీ బృందాలు రాజధాని భూములతో పాటు అగ్రిగోల్డ్ కుంభకోణం, తాజాగా బయటపడిన ఈఎస్ఐ స్కాంపైనా వివరాలు సేకరిస్తున్నాయి. విజిలెన్స్, ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ చెబుతున్నట్లుగా రూ.988 కోట్ల నిధుల్లో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వ వాటా కావడంతో ఈడీ ఈ వ్యవహారంపైనా ఆరా తీస్తోంది. అలాగే గత టీడీపీ సర్కారులో చోటు చేసుకున్న మరో వ్యవహారం అగ్రిగోల్డ్ స్కాంపైనా ఈడీ ఆరా తీసింది. ఇందులో మనీలాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు వెళ్లాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు దీనిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?
 అసెంబ్లీ వేళ టీడీపీకి ముచ్చెమటలు...

అసెంబ్లీ వేళ టీడీపీకి ముచ్చెమటలు...

ఓ వైపు బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశమవుతున్న వేళ గత టీడీపీ సర్కారు హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూములు, ఈఎస్ఐ, అగ్రిగోల్డ్ స్కాంలలో ఈడీ దర్యాప్తుకు సిద్ధం కావడం ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులను కక్షసాధింపుగా అభివర్ణిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని భావించిన టీడీపీకి ఈడీ దర్యాప్తు మింగుడు పడటం లేదు. తమ నేతల అరెస్టులను ప్రస్తావిస్తే ఈడీ దర్యాప్తును వైసీపీ నేతలు లేవనెత్తే అవకాశం ఉండటంతో టీడీపీ ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్ధితి నెలకొంది.

English summary
enforcement directorate officials have started their investigation in amaravati land scam. ed officials inqure crda officials today and know the details about recent esi scam and agri gold issue also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X