వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడలోని అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఇళ్లపై ఈడీ సోదాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి : అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ అవ్వాసు వెంకట రామారావుకు చెందిన విజయవాడ నివాసం, కార్యాలయాల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
తెల్లవారు జామునుంచి సత్యనారాయణపురంలోని అవ్వాసు ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఇళ్లలో ఈడీ సోదాలు

అగ్రిగోల్డ్ స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛైర్మన్ అవ్వాసు రామారావు లావాదేవీలపై ఈడీ దృష్టిసారించింది. ఇవాళ ఉదయం విజయవాడ చేరుకున్న ఈడీ బృందాలు సత్యనారాయణపురంలోని అవ్వాసు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ స్కామ్ లో డబ్బు ఎవరెవరి చేతులు మారింది, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు వంటి విషయాలపై ఈడీ అవ్వాసును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో కీలక ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయి.

ED raids on Agri Gold Chairmans Properties in Vijayawada

ఈడీ సోదాలతో దర్యాప్తు ముమ్మరం

అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు చేసేందుకు ఈడీ కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. దీని ఆధారంగా ఈడీ ఇవాళ సోదాలు చేస్తోంది. గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీఐడీ కూడా దర్యాప్తు చేసింది. పలువురిని అరెస్టు చేసింది. వీరిలో చాలా మంది బెయిల్ పై బయట ఉన్నారు.

తాజాగా అగ్రిగోల్డ్ ఆస్తుల బదలాయింపులో అనుమానాల నేపథ్యంలో ఈడీ తనిఖీలు
చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర సాయుధ బలగాల సహకారంతో ఈడీ సోదాలు నిర్వహిస్తుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

English summary
ED Raids on Agri Gold Chairman AV Rama Rao's Houses in Vijayawada. ED Officials have raided on Agri Gold Chairman's Properties in Agri Gold Scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X