అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన, సర్కార్ బడుల్లో వసతులు, నాణ్యమైన భోజనం, ఏడాదికి 15 వేలు: సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఇంగ్లిష్ లగ్జరీ కాదు అవసరం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అక్షరాస్యతలో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ వెనకబడిందని చెప్పారు. 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టామని వివరించారు. మూడేళ్లలో ఏపీ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మారుస్తామని భరోసానిచ్చారు. బుధవారం విజయవాడ గేట్ వే హోటల్‌లో జరిగిన 'ది హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' సదస్సు సీఎం జగన్ హాజరై ప్రసంగించారు.

 మార్పునకు నాంది..

మార్పునకు నాంది..

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు కనీస తొమ్మిది వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్కూల్‌కి బాత్ రూం, మంచినీరు, కంపౌండ్ వాల్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డు, పాఠశాలకు పెయింటింగ్, మంచి ఫినిషింగ్‌, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వసతుల కల్పనతో ప్రభుత్వ ఇంగ్లిష్ బడులకు వచ్చేందుకు పిల్లలు ఆసక్తి కనబరుస్తారని పేర్కొన్నారు.

 నాణ్యమైన భోజనం

నాణ్యమైన భోజనం

మద్యాహ్న భోజన పథకంలో కూడా క్వాలిటీ పెంచుతామని సీఎం జగన్ స్పష్టంచేశారు. విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు పంపించే దాదాపు 32 లక్షల మంది తల్లులకు ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఆర్థిక భరోసా అందజేయడంతో పేరెంట్స్ కూడా ప్రభుత్వ బడులకు పంపించేందుకు ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లులను ప్రోత్సహించడంతో బడికొచ్చి పిల్లల శాతం పెరుగుతోందని జగన్ చెప్పారు. రెండో ఏడాది నుంచి హాజరుశాతం పెంచేందుకు చర్యలు చేపడుతామని వివరించారు. 75 శాతం హాజరుతగ్గకుండా ప్రణాళిక రచించినట్టు వివరించారు.

ఏపీ ఫస్ట్..

3 వేల 648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల బాధలను తెలుసుకున్నానని, వాటిని అమలు చేస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. దీంతో బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మేలు జరుగుతోందని చెప్పారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. సీఎంగా నిర్ణయాలు తీసుకొకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతోందన్నారు.

పేదలే ఎందుకు..?

పేదలే ఎందుకు..?

పేదలు మాత్రమే ఎందుకు తెలుగు మీడియంలో చదవాలి అని ప్రశ్నించారు. ఓ తండ్రిగా పిల్లలను తెలుగు మీడియం స్కూల్‌కి పంపగలనా అని ప్రశ్నించారు. ప్రస్తుతం మనం వాడే కంప్యూటర్, ఫోన్ ఇంగ్లిష్‌లోనే ఉంటాయని చెప్పారు. ఇంగ్లిష్ ద్వారా మాత్రమే పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకుంటారని గుర్తుచేశారు.

English summary
Education system will be modified in state ap cm ys jagan mohan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X