వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల సంఘం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం : సీయ‌స్ పై వేటు..కొత్త సీయ‌స్ గా ఎల్వీ: అసలు కార‌ణం ఇదే..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల సంఘం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పునీఠా పై వేటు వేసింది. ఏకం గా చీఫ్ సెక్ర‌ట్రీ స్థాయి అధికారి పైనే వేటు వేయ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఆయ‌న్ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూత‌న సీయ‌స్ గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ను నియ‌మించింది.

సీయ‌స్ పై ఎన్నిక‌ల సంఘం వేటు..

సీయ‌స్ పై ఎన్నిక‌ల సంఘం వేటు..

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ చంద్ర పునీఠా పై ఎన్నిక‌ల సంఘం వేటు వేసింది. ఆయ‌న్ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ను ప్ర‌భుత్వ ప్ర‌ధా న కార్య‌ద‌ర్శిగా పునీఠా స్థానంలో నియ‌మించారు. ఏపిలో ఐపియ‌స్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం తీసుకు న్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌టం లో అప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వ ఒత్తిడికి లొంగార‌నే కార‌ణంతో ఆయ‌న్ను ఎన్నిక‌ల సంఘం త‌మ వ‌ద్ద‌కు పిలిపించింది. ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ తో సంతృప్తి చెంద‌ని ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌ను ఎన్నిక‌ల విధు ల నుండి త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఏకంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నే ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చేయ‌టం ద్వారా ఏపిలో ప‌రిస్థితుల పై ఎంత సీరియ‌స్ గా ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రిస్తుందో అర్దం అవుతోంది.

ఏబి వెంక‌టేశ్వ‌ర రావు జీవో నే కార‌ణ‌మా..

ఏబి వెంక‌టేశ్వ‌ర రావు జీవో నే కార‌ణ‌మా..

ఏపి ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంక‌టేశ్వ‌ర రావుతో పాటుగా మ‌రో రెండు జిల్లాల ఎస్పీల‌ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పి స్తూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం ప్ర‌కారం తొలుత ఉత్త ర్వులు జారీ చేసి..ఆ త‌రువాత ఇంట‌లిజెన్స్ చీఫ్ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం తో న్యాయ పోరాటానికి దిగింది. దీని పై ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వ పెద్ద‌ల సూచ‌న‌ల మేర‌కు ఇంట‌లిజెన్స్ చీఫ్ ను త‌ప్పించి ఇద్ద‌రు ఎస్పీల‌ను మాత్రం బ‌దిలీ చేసింది. దీని పై కోర్టుకు వెళ్ల‌గా..అక్క‌డ హై కోర్టు సైతం ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసిం ది. దీంతో...త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ఇంట‌లిజెన్స్ చీఫ్ ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నా రు. కానీ, పునీఠా వివ‌ర‌ణ పై సంతృప్తి చెంద‌ని ఎన్నిక‌ల సంఘం ఏకంగా సీయ‌స్ ను త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

కొత్త సీయ‌స్ గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..

కొత్త సీయ‌స్ గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..

పునీఠా ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్న ఎన్నిక‌ల సంఘం ఆయ‌న స్థానంలో ప్ర‌భుత్వ ప్ర‌త్యే క కార్య‌ద‌ర్శి గా ఉన్న ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ను నియ‌మించారు. ఎన్నిక‌ల కోడ్ పూర్త‌య్యే వ‌ర‌కూ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ఏపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతారు. ఎన్నిక‌ల వేళ‌..త‌మ ఉత్త‌ర్వులు అమ‌లు చేయ‌క‌పోతే ఏ స్థాయిలో ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామో ఎన్నిక‌ల సంఘం ఈ నిర్ణ‌యం ద్వారా ఒక హెచ్చ‌రిక జారీ చేసింది. దీంతో..ఎన్నిక‌ల సంఘం రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో అనే టెన్ష‌న్ మొద‌లైంది.

English summary
Eelction commission takean another sensational Decision on Ap Govt. CEC given orders that AP CS Punitha transferred and LV Subramanyam appointed as New C.S.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X