కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌నం : నిఘా బాస్ పై వేటు : ఇద్ద‌రు ఎస్పీల పైనా చ‌ర్య‌లు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపి స్తుండడంతో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

వైసిపి ఫిర్యాదు తో నిర్ణ‌యం..

వైసిపి ఫిర్యాదు తో నిర్ణ‌యం..

ఏపిలో ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొంత కాలంగా వైసిపి ఎన్నిక‌ల సంఘానికి ఏబి వెంక‌టేశ్వ‌ర రావు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వ‌రుస ఫిర్యాదు లు చేస్తూ వ‌చ్చింది. అందులో ప్ర‌ధానంగా వైసిపి నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆధారాల‌ను వైసిపి నేత‌లు స మ‌ర్పించారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యం నుండి ప్ర‌స్తుత ఎన్నిక‌ల వ‌ర‌కు నిఘా సిబ్బందిని ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పూర్తిగా అధికార పార్టీ కోసం వినియోగించార‌నేది వైసిపి ఆరోప‌ణ‌. పోలీసు సిబ్బంది ద్వారా న‌గ‌దు గ్రామాల‌కు త‌ర‌లిస్తున్నా ర‌ని ఫిర్యాదు చేసారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల బ‌లాబ‌లాలు..అధికార పార్టీ తీసుకోవా ల్సిన చ‌ర్య‌ల పై నిఘా బాస్ స‌మాచారం ఇస్తున్నార‌ని..కింది స్థాయి సిబ్బందిని ప్ర‌భావితం చేస్తున్నార‌ని వైసిపి నేత‌లు ఇచ్చిన ఫిర్యాదు పై విచార‌ణ చేసిన ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇద్ద‌రు ఎస్పీల పైనా వేటు..

ఇద్ద‌రు ఎస్పీల పైనా వేటు..

వైసిపి ఫిర్యాదుల మేర‌కు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ , ఏబీ వెంకటేశ్వరరావును హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌లో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించా లని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలు తమ తర్వాత ఉండే అధికారులకు బాధ్యతలు అప్పగిం చాలని ఈసీ వెల్లడించింది. ఇరువురు హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టులు చేయాలని, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. శ్రీకాకుళ్ ఎస్పీ వెంక‌ట‌ర‌త్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కు సంబందించి న న‌గ‌దు దొరికినా వ‌దిలేసార‌నేది వైసిపి ఫిర్యాదు. ఇక‌, క‌డ‌ప ఎస్పీ పైనా వైసిపి ఫిర్యాదు చేసింది. క‌డ‌ప జిల్లాలో వైయ‌స్ వివేకా హ‌త్య త‌రు వాత ప‌రిణామాల పై వైసిపి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేసింది. వివేకా కుమార్తె సైతం ఎన్నిక‌ల సంఘానికి దీని పై నివేదించింది.

వివేకా హ‌త్య కేసు పైనా ప్ర‌భావం..

వివేకా హ‌త్య కేసు పైనా ప్ర‌భావం..

వైయ‌స్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు విచారిస్తున్న స‌మ‌యంలో క‌డ‌ప ఎస్పీ పై వేటు వేసారు. ఇప్ప‌టికే ఈ హ‌త్య కేసు ను సిట్ కు అప్ప‌గించారు. అయితే, సిట్ ఇక ఈ కేసుకు సంబందించి మీడియా కు వివ‌రాలు వెల్ల‌డించవ‌ద్ద‌ని హై కోర్టు ఆదేశించింది. సాయంత్రానికి ఎస్పీని ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. క‌డ‌ప జిల్లాలో టిడిపి అధిప‌త్యం సాధించేందుకు పోలీసుల సాయంతో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైసిపి ఫిర్యాదు చే సింది. దీంతో..ఇప్పుడు ప్ర‌భుత్వం నిఘా చీఫ్ గా ఎవ‌రికి అవ‌కాశం ఇస్తుంది..ఈ రెండు జిల్లాల‌కు కొత్త గా ఎస్పీలుగా ఎవ‌రిని నియ‌మిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
election commission sensational decision taken on Ap Police officers. EC Directed Ap Govt to Intelligence ADG and Srikakulam , kadapa sps keep away form elections duty. ON YCP complaints Elections commission takes this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X