• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌నం : నిఘా బాస్ పై వేటు : ఇద్ద‌రు ఎస్పీల పైనా చ‌ర్య‌లు..!

|

ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపి స్తుండడంతో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

వైసిపి ఫిర్యాదు తో నిర్ణ‌యం..

వైసిపి ఫిర్యాదు తో నిర్ణ‌యం..

ఏపిలో ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొంత కాలంగా వైసిపి ఎన్నిక‌ల సంఘానికి ఏబి వెంక‌టేశ్వ‌ర రావు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వ‌రుస ఫిర్యాదు లు చేస్తూ వ‌చ్చింది. అందులో ప్ర‌ధానంగా వైసిపి నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆధారాల‌ను వైసిపి నేత‌లు స మ‌ర్పించారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యం నుండి ప్ర‌స్తుత ఎన్నిక‌ల వ‌ర‌కు నిఘా సిబ్బందిని ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పూర్తిగా అధికార పార్టీ కోసం వినియోగించార‌నేది వైసిపి ఆరోప‌ణ‌. పోలీసు సిబ్బంది ద్వారా న‌గ‌దు గ్రామాల‌కు త‌ర‌లిస్తున్నా ర‌ని ఫిర్యాదు చేసారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల బ‌లాబ‌లాలు..అధికార పార్టీ తీసుకోవా ల్సిన చ‌ర్య‌ల పై నిఘా బాస్ స‌మాచారం ఇస్తున్నార‌ని..కింది స్థాయి సిబ్బందిని ప్ర‌భావితం చేస్తున్నార‌ని వైసిపి నేత‌లు ఇచ్చిన ఫిర్యాదు పై విచార‌ణ చేసిన ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇద్ద‌రు ఎస్పీల పైనా వేటు..

ఇద్ద‌రు ఎస్పీల పైనా వేటు..

వైసిపి ఫిర్యాదుల మేర‌కు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ , ఏబీ వెంకటేశ్వరరావును హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌లో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించా లని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలు తమ తర్వాత ఉండే అధికారులకు బాధ్యతలు అప్పగిం చాలని ఈసీ వెల్లడించింది. ఇరువురు హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టులు చేయాలని, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. శ్రీకాకుళ్ ఎస్పీ వెంక‌ట‌ర‌త్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కు సంబందించి న న‌గ‌దు దొరికినా వ‌దిలేసార‌నేది వైసిపి ఫిర్యాదు. ఇక‌, క‌డ‌ప ఎస్పీ పైనా వైసిపి ఫిర్యాదు చేసింది. క‌డ‌ప జిల్లాలో వైయ‌స్ వివేకా హ‌త్య త‌రు వాత ప‌రిణామాల పై వైసిపి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేసింది. వివేకా కుమార్తె సైతం ఎన్నిక‌ల సంఘానికి దీని పై నివేదించింది.

వివేకా హ‌త్య కేసు పైనా ప్ర‌భావం..

వివేకా హ‌త్య కేసు పైనా ప్ర‌భావం..

వైయ‌స్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు విచారిస్తున్న స‌మ‌యంలో క‌డ‌ప ఎస్పీ పై వేటు వేసారు. ఇప్ప‌టికే ఈ హ‌త్య కేసు ను సిట్ కు అప్ప‌గించారు. అయితే, సిట్ ఇక ఈ కేసుకు సంబందించి మీడియా కు వివ‌రాలు వెల్ల‌డించవ‌ద్ద‌ని హై కోర్టు ఆదేశించింది. సాయంత్రానికి ఎస్పీని ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. క‌డ‌ప జిల్లాలో టిడిపి అధిప‌త్యం సాధించేందుకు పోలీసుల సాయంతో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైసిపి ఫిర్యాదు చే సింది. దీంతో..ఇప్పుడు ప్ర‌భుత్వం నిఘా చీఫ్ గా ఎవ‌రికి అవ‌కాశం ఇస్తుంది..ఈ రెండు జిల్లాల‌కు కొత్త గా ఎస్పీలుగా ఎవ‌రిని నియ‌మిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

కడప యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
వైఎస్ అవినాష్ రెడ్డి వైయస్సార్‌సీపీ విజేతలు 7,83,799 64% 3,80,976
దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,02,823 33% 3,80,976
2014
వై .ఎస్ అవినాష్ రెడ్డి వైయస్సార్‌సీపీ విజేతలు 6,71,983 56% 1,90,323
శ్రీనివాస రెడ్డి రెడ్దప్పగిరి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,81,660 40% 0
2009
వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ విజేతలు 5,42,611 53% 1,78,846
పాలేమ్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,63,765 35% 0

English summary
election commission sensational decision taken on Ap Police officers. EC Directed Ap Govt to Intelligence ADG and Srikakulam , kadapa sps keep away form elections duty. ON YCP complaints Elections commission takes this decision.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more