వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడిగుడ్ల దాడి...వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి పరాభవం...

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వరుస పరాభవాలు తప్పడం లేదు. వైసిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ రెడ్డి మిగితా ఫిరాయింపు ఎమ్మెల్యేల లాగానే అభివృద్ది మంత్రం జపించి టిడిపి లోకి జంపయ్యారు.

అయితే మిగతావారి సంగతేమో కాని ఈయనకు మాత్రం నియోజకవర్గంలో అవమానాలే ఎదురవుతున్నాయి. అటు వైసిపి వాళ్లే కాకుండా ఇటు టిడిపి వాళ్లు కూడా వివిధ కారణాలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని నిలదీస్తుండటంతో అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

 కోడిగుడ్ల దాడి...

కోడిగుడ్ల దాడి...

గిద్దలూరు నుంచి వైకాపా తరుపున గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆ తరువాత నియోజకవర్గం అభివృద్ది కోసమంటూ టిడిపిలోకి మారారు.
అయితే తాను విడిచివచ్చిన వైసిపి నుంచే కాకుండా చేరిన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయనకు అవమానకర ఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ పర్యటించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది.

 దాడి ఎలా జరిగింది?

దాడి ఎలా జరిగింది?

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెలగలపాయ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేశారు. ఈ గుడ్ల దాడితో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది.

ఎవరు చేశారు?

ఎవరు చేశారు?

ఎమ్మెల్యేపై కోడి గుడ్లు విసిరినట్టుగా అనుమానిస్తున్న కొందరు యువకులను ఎమ్మెల్యే అనుచరులు పట్టుకోని చేయిచేసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఈ దాడి కి కారణం అనే అనుమానంతో అక్కడవున్న గ్రామ సర్పంచ్ బంధువులైన నలుగురు యువకులపై దాడి చేశారు.

పోలీసుల కేసు పెట్టారా?

పోలీసుల కేసు పెట్టారా?

గుడ్ల దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఇది ఎమ్మెల్యేపై గుడ్ల దాడి కాదని, మద్యం మత్తులో యువకులు పరస్పరం కోడిగుడ్లు విసురుకున్నారని చెబుతున్నారు. ఈ గుడ్ల దాడికి సంబంధించి ఇప్పటివరకు తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

 గతం లోనూ...

గతం లోనూ...

గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఇలా అవమానాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. వైసిపి నుంచి ఫిరాయించి టిడిపి లోకి వచ్చినప్పటి నుంచి ఆయన నియోకవర్గంలో ప్రతికూల ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ సందర్భంలో అభివృద్ది కోసమంటూ టిడిపిలో చేరిన అశోక్ రెడ్డిని వైసిపి మద్దతుదారులు ఏం అభివృద్ది చేశారో చెప్పాలని నిలదీయగా, మరో సందర్భంలో సొంత అభివృద్దే తప్ప నియోజకవర్గాన్ని ఏం అభివృద్ది చేశారో చెప్పాలని అందరిముందు టిడిపి కార్యకర్తలే ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తెలియని ఎమ్మెల్యే మౌనంగా అక్కడనుంచి వెళ్లిపోయారట.

English summary
prakasam dist: ashok reddy, giddaluru mla on Tuesday faced an embarrassing moment when unknown persons hurled eggs at him in his own constituency. He, however, shrugged off the attack, saying he was not afraid to these type of attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X