maoists police koraput landmine blast aob orissa andhra pradesh killed మావోయిస్టులు పోలీసులు పేలుడు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మృతి
మావోల ప్రతీకారమే: మందుపాతర పేల్చి 8మందిని బలి తీసుకున్నారు(పిక్చర్స్)
విజయనగరం: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో పోలీసుల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోరాపుట్ నుంచి కటక్‌కు 12 మంది పోలీసులు శిక్షణ కోసం మినీబస్సులో బయలుదేరారు. సుంకి-సాలూరు హైవేపై ముంగారుగుమ్మి గ్రామ సమీపానికి బస్సు చేరగానే మావోయిస్టులు మందుపాతర పేల్చారు. బస్సు ధ్వంసం కావడంతోపాటు జాతీయరహదారిపై ఏడు అడుగుల లోతైన గుంత పడింది.

పంజా విసిరిన మావోలు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఒడిశా సాయుధ పోలీసు (ఓఎస్ఏపీ)లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొరాపుట్ జిల్లా కొట్టంగి తాలూకా ముంగారుగుమ్మి గ్రామ సమీపంలో భారీ మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో ఎనిమిది పోలీసులు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మరో అధికారి ఆచూకీ లేదు
బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఎస్ఐ స్థాయి అధికారి ఆచూకీ దొరకలేదు. ఒడిశా పోలీసు విభాగంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న 13 మంది శిక్షణ నిమిత్తం కొరపూట్ నుంచి అనుగుల్ జిల్లాకు ఓ వాహనంలో వెళ్తున్నారు. 26వ జాతీయ రహదారి (రాయపూర్-విశాఖపట్నం)లోని ముంగారుగుమ్మి సమీపంలో ఓ కల్వర్టు వద్దకు అది చేరుకోగానే..ఒక్కసారిగా భారీ పేలుడు సంభించింది.

లోయలోపడిన వాహనం
పేలుడు దాటికి వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. అక్కడే అయిదుగురు మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కొరాపుట్ విపత్తు నివారణ సంస్థ సిబ్బంది, విజయనగరం జిల్లా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

క్షతగాత్రుల తరలింపు
తీవ్ర గాయాలతో ఉన్న ఏడుగురిని తొలుత సుంకి ప్రాథమిక ఆసుపత్రికి తరలించగా ఒకరు... అక్కడి నుంచి సాలూరు ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అయిదుగురికి సాలూరు ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఇద్దరికి సాలూరులో చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒడిశాకి చెందినవారేనని ఆంధ్రా పోలీసులు చెబుతున్నారు.

ప్రణాళిక ప్రకారమే పేలుడు
పెద్ద ఎత్తున మావోయిస్టులు అక్కడకు చేరుకుని మందుపాతర పేల్చిన అనంతరం ఒడిశా వైపుగా వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనా ప్రాంతం విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామమైన రొడ్డవలసకి కేవలం 4 కి.మీ.దూరంలోనే ఉండడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతీకారంగానే..
పేలుడుకి ఉపయోగించింది ఆర్డీఎక్స్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో గత ఏడాది నవంబరులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగానే అదను చూసి మందుపాతర పేల్చినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్పత్రిలో చికిత్స
సాలూరు ఆసుపత్రిలో మృతి చెందిన హరికృష్ణ పృష్టి మినహా మిగతా ఆరుగురి పేర్లు తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల్లో రాధా శ్యాం దాస్, ప్రదీప్ వకాలిక్త్, లిపుకుమార్ నాథ్, ప్రమోద్‌కుమార్ బిశ్వాల్, శ్వేతకుమార్ దాస్‌లు చికిత్స పొందుతున్నారు.

అప్రమత్తం
మందుపాతర పేలుడుతో మరోసారి ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.