వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీల కోసం జగన్ గేట్లు ఎత్తేస్తారా?: ఆ ముగ్గురితో పాటు ఎనిమిది మంది రెడీ: వైసీపీ హామీ..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: శాసనసభలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పీడ్‌కు బ్రేక్ వేసింది తెలుగుదేశం పార్టీ. శాసన మండలిలో మెజారిటీ సభ్యులు ఉన్న టీడీపీ ఏపీ వికేంద్రీకరణ బిల్లు విషయంలో వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టింది. ఈ బిల్లుకు తెలుగుదేశం అడ్డు పడుతుందనే విషయం ఊహించినదే. అయినప్పటికీ.. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని గండం గట్టెక్కాలని భావించింది.

నారా లోకేష్.. బర్త్‌డే గిఫ్ట్: ఫుల్ జోష్‌లో టీడీపీ: అమరావతిలో సంబరాలు..ఘనస్వాగతంనారా లోకేష్.. బర్త్‌డే గిఫ్ట్: ఫుల్ జోష్‌లో టీడీపీ: అమరావతిలో సంబరాలు..ఘనస్వాగతం

 వైఎస్ జగన్‌లో అసహనానికి..

వైఎస్ జగన్‌లో అసహనానికి..

అదే సమయంలో- మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకోవడాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ ఏ మాత్రం ఊహించలేకపోయింది. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురి చేశాయని, ఆయనను కొన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించేలా చేస్తోందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. శాసన మండలి రద్దు చేయాలని మొదట భావించినప్పటికీ..అనంతరం దాన్ని విరమించుకున్నారని చెబుతున్నారు.

ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేలా..

ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేలా..

తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు పార్టీ ఫిరాయించేలా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదనేది వైఎసఆర్సీపీ నాయకుల వాదన. ప్రజలకు మేలు చేసే విషయంలో ఎంత దాకా అయినా సరే వెళ్లాలనే కృతనిశ్చయం వైఎస్ జగన్‌లో కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ దిశగా త్వరలోనే వైఎస్ జగన్.. ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమౌతోంది.

మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, శివనాథ్ రెడ్డి..

మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, శివనాథ్ రెడ్డి..

తెలుగుదేశం పార్టీకి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసన మండలి సమావేశాలకు ముందే తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఆయనను పార్టీలో చేర్చుకోవాలని ఇది వరకే సూచనప్రాయంగా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని, ఆయనతోనే భర్తీ చేయవచ్చని అంటున్నారు. దీనితో పాటు- పోతుల సునీత, చదిపిరాళ్ల శివనాథ్ రెడ్డిలను పార్టీలో చేర్చుకోవడం దాదాపు ఖాయమైందని చెబుతున్నారు.

 శాసన మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకే..

శాసన మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకే..

శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే చేరుతాయి. అందుకే- కొద్దిగా వేచి చూద్దామనే ధోరణిలో వైఎస్ జగన్ ఉన్నారని చెబుతున్నారు. వచ్చే అయిదేళ్ల కాలంలో దశలవారీగా తెలుగుదేశం పార్టీ దాదాపు అన్ని స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది శాసన మండలిలో. 2024 నాటికి మండలిలో టీడీపీకి ముగ్గురు మాత్రమే సభ్యులు మిగిలవచ్చని అంచనా వేస్తున్నారు.

English summary
Eight Telugu Desam Party MLCs ready to join in our Party, if Chief Minister YS Jagan Mohan Reddy accepts, says YSR Congress Party leaders. If our party Chief accepts them, they are ready to quit the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X