చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఎనిమిదో పాజిటివ్ కేసు.. లండన్ టూ తిరుపతి వయా చెన్నై... 61 మంది సేఫ్.. 14 శాంపిల్స్ పెండింగ్..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికమవుతూనే ఉంది. విదేశాల నుంచి తామర తంపరగా తరలివస్తున్న విద్యార్ధుల వల్ల ఏపీలో కరోనా ప్రభావం మరింత పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాటిజివ్ బాధితుల సంఖ్య 7గా తేలగా.. ఇవాళ లండన్ నుంచి వచ్చిన మరో విద్యార్ధికి కూడా కరోనా పాటిజివ్ గా గుర్తించారు. దీంతో అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.

ఏపీలో ఎనిమిదో కరోనా పాజిటివ్ కేసు..
ఏపీలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి చెన్నైకు విమానంలో వచ్చిన ఓ 25 ఏళ్ల విద్యార్ధి.. అక్కడి నుంచి 19వ తేదీన తిరుపతికి రోడ్డు మార్గంలో చేరుకున్నాడు. 23వ తేదీ కల్లా అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అధికారులు అతని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపగా.. ఇవాళ పాజిటివ్ గా తేలింది. దీంతో అతన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్చి క్వారంటైన్ చికిత్స అందిస్తున్నారు.

eighth coronavirus positive case detected in ap, 61 samples tested negative today.

నెగెటివ్ గా తేలిన 61 శాంపిల్స్..
ఇప్పటికే వివిధ ల్యాబ్స్ కు పంపిన శాంపిల్స్ లో 61 నెగెటివ్ గా తేలినట్లు ప్రభుత్వం తాజా హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో 14 శాంపిల్స్ మాత్రం ఇంకా ల్యాబ్స్ లో పెండింగ్ లో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో వీటి ఫలితాలు కూడా రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ గా తేలిన 8 కేసుల్లో నెల్లూరు విద్యార్ధి కోలుకోవడంతో అతన్ని ఇంటికి పంపి హోం క్వారంటైన్ అందిస్తున్నారు. మిగతా వారిలో ఒంగోలు, విజయవాడ, కాకినాడలో ఒక్కొక్కరు, వైజాగ్ లో ముగ్గురు క్వారంటైన్ లో ఉన్నారు.

English summary
another coronavirus postive case detected in ap as the number grows to eight today. a student came from london to tirupathi via chennai has been tested positive today and sent to ruia hospital in tirupathi. and 61 samples sent to labs are confirmed as negative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X