కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు ముద్దులిచ్చి, ఇప్పుడు గుద్దులా, మందడం మహిళా రైతులపై దాడిపై అమరావతి అన్నదాతలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Amaravati farmers Protest : Police Officers Rude Behavior With AP Capital Women Farmers

రాజధానిని మార్చొద్దని గత 18 రోజులుగా అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మందడంలో మహిళా రైతులపై అసభ్య ప్రవర్తనను నిరసిస్తూ ఇవాళ రైతులు బంద్‌నకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌తో బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. కిరణా షాపులు, ఇతర సముదాయాలు కూడా మూసివేసి బంద్‌కు సహకరిస్తున్నారు. అమరావతి రాజధానిని మార్చొద్దని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

రేపటినుంచి 'సకల జనుల సమ్మె’ పాలు, మందులు, ఆస్పత్రి తప్ప, రాజధాని జేఏసీ మలిదశ ఉద్యమం రేపటినుంచి 'సకల జనుల సమ్మె’ పాలు, మందులు, ఆస్పత్రి తప్ప, రాజధాని జేఏసీ మలిదశ ఉద్యమం

తుళ్లూరులో మహాధర్నా..

తుళ్లూరులో మహాధర్నా..


అమరావతిలో దీక్ష చేపట్టిన రైతులు ర్యాలీగా తుళ్లూరు చేరుకుంటున్నారు. తుళ్లూరులో మెగా ర్యాలీ స్థలికి వస్తోన్నారు. మహిళలపై పోలీసుల అనుచిత ప్రవర్తన నేపథ్యంలో బంద్‌కు అన్నివర్గాలు మద్దతు తెలిపాయి. వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసివేసి బంద్‌కు సపోర్ట్ చేస్తున్నారు. రాజధాని మార్చొచ్చని, ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

5 కోట్ల మంది ఆంధ్రులు..

5 కోట్ల మంది ఆంధ్రులు..

తమ బంద్‌కు 5 కోట్ల మంది ఆంధ్రులు సపోర్ట్ చేయాలని రైతులు కోరుతున్నారు. 18 రోజులుగా తాము శాంతియుతంగా నిరసన చేపడుతున్నామన్నారు. కానీ నిన్న మందడంలో మహిళా రైతులతో పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. ఆందోళన చేస్తున్న మహిళలను కొరికి, రక్కడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు జులం నశించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిని విధుల నుంచి తప్పించాలని తేల్చిచెప్పారు.

అప్పుడు ముద్దులు..

అప్పుడు ముద్దులు..

మందడంలో మహిళ రైతులపై దాడి జరిగితే తమ వద్దకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారే తప్ప.. తమ దగ్గరకు ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నారు. ఓట్లు అడిగే సమయంలో ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దడం ఏంటీ అని మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములిస్తే పోలీసుల చేత దాడులు చేయిస్తారా అని నిలదీశారు.

పోలీసు జులుం..

పోలీసు జులుం..

13 జిల్లాల ప్రజల ప్రయోజనాల కోసం రాజధాని భూములు ఇచ్చామని అన్నదాతలు చెప్తున్నారు. కానీ రాజధాని మార్పు పేరుతో పోలీసులు తమపై విరుచుకుపడటం సరికాదంటున్నారు. జీవనాధారమైన పొలం ఇచ్చిన రైతులం తప్పా.. రౌడీ, గుండాలం కాదని వాపోయారు. రాజధాని కోసం భూములిచ్చినా తమ భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదని నిట్టూరుస్తున్నారు. కమిటీలతో తమ భవిష్యత్ అంధకారం చేయొద్దని సూచించారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు. రైతులంతా కలిసి తుళ్లూరు సెంటర్ వద్దకు చేరుకొని మహాధర్నా చేపడుతారు.

English summary
amaravati farmers agitation at tullur. assembly election before ycp chief jagan mohan reddy kiss the people, after that police attack the public farmers alleged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X