వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ష్..గ‌ప్‌చుప్ : ప్ర‌చారం ముగిసింది..ప్ర‌లోభాల‌కు తెర లేచింది: ఎన్నిక‌ల సంఘం డేగ క‌న్ను..!

|
Google Oneindia TeluguNews

ఏపి..తెలంగాణాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఏపిలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల తో పాటుగా 25 లోక్‌స‌భ ని యోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే విధంగా..తెలంగాణ‌లో మొత్తం 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్ని క‌ల నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాజ‌కీయ పార్టీల హోరా హోరీ ప్ర‌చారం పూర్తి కావ‌టంతో ఈ నెల 11న ఏపి..తెలంగాణ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇందు కోసం ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాటు పూర్తి చేసింది.

ఏపిలో 3.93 కోట్ల మంది ఓట‌ర్లు..

ఏపిలో 3.93 కోట్ల మంది ఓట‌ర్లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన తుది జాబితా మేర‌కు మొత్తంగా 3 కోట్ల 93 ల‌క్ష‌ల 45 వేల 717 మం ది ఓట‌ర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు.. కోటి 94 లక్షల 62 వేల 339 మంది ఉండ‌గా, మహిళా ఓటర్లు..కోటి 98 లక్ష ల 79 వేల 421. మంది ఉన్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఇక‌, ధర్డ్ జండర్ ఓటర్లు.3957 మంది..దివ్యాంగ ఓట ర్లు 5 లక్షల 27 వేల 734 మంది ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా ఓటర్లు తూ,గోదావరి జిల్లాలో 42 లక్షల 4వేల436 మంది ఉండగా..అత్యల్ప ఓటర్లు ఉన్న జిల్లా విజయనగరంలో 18 లక్షల 18 వేల113 మంది. ఉన్నారు. కాగా, కొత్త‌గా 18- 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 10 లక్షల15 వేల మంది కొత్త‌గా ఓటు హ‌క్కు సాధించారు.

లోక్‌స‌భ బ‌రిలో 319..అసెంబ్లీ బ‌రిలో 2118 మంది..

లోక్‌స‌భ బ‌రిలో 319..అసెంబ్లీ బ‌రిలో 2118 మంది..

ఏపిలోని మొత్తం 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 319 మంది అభ్య‌ర్దులు బ‌రిలో ఉన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 2118 మంది బ‌రిలో నిలిచారు. ఇక‌, ఈ నెల 11న జ‌రిగే పోలింగ్ కోసం ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అం దులో భాగంగా ఏపిలో 45 వేల 920 మంది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. మూడు ల‌క్ష‌ల మంది పోలింగ్ సిబ్బంది ని నియ‌మించారు. ల‌క్షా 20 వేల మంది పోలీసు సిబ్బందిని సిద్దం గా ఉంచారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం 7,300 ఆర్టీసి బ‌స్సుల‌ను సిద్దం చేస్తున్నారు. మ‌రో 300 ప్ర‌యివేటు బ‌స్సుల‌ను అద‌నంగా ఏర్పాటు చేస్తున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా రెండు హెలికాఫ్ట‌ర్లు సిద్దంగా ఉంచుతున్నారు. 15 మంది అభ్య‌ర్దులు దాటిన చోట రెండు ఇవియం లు ఏర్పాటు చేసా రు. ఒక్కో ఇవియం లో 1400 మంది మాత్ర‌మే ఓటు వేసే అవ‌కాశం ఉంటుంది. అధికంగా గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గానికి 34 మంది అభ్య‌ర్దులు పోటీలో ఉన్నారు. అత్య‌ధికంగా నంద్యాల లోక్‌స‌భ కోసం 20 మంది అభ్య‌ర్దులు పోటీలో నిలిచారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం 20 మంది ప‌రిశీల‌కుల‌ను నియ‌మించారు.

తెలంగాణ లో బ‌రిలో 443 మంది అభ్య‌ర్దులు..

తెలంగాణ లో బ‌రిలో 443 మంది అభ్య‌ర్దులు..

తెలంగాణ లోని మొత్తం 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల కోసం హోరా హోరీ ప్ర‌చారం సాగింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. మొత్తం 17 లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల్లో 443 మంది అభ్య‌ర్దులు బ‌రిలో నిలిచారు. అధికంగా నిజామాబాద్ నుండి ఎక్కువ మంది అభ్య‌ర్దులు పోటీలో నిలిచారు. అక్క‌డ రైతులు తాము ఎన్నిక‌ల్లో నిల‌వ టం ద్వారా త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌రువాత ఎన్నిక‌ల సంఘం నిజామాబాద్ లో సైతం య‌ధాత‌ధంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కు నిర్ణ‌యం తీసుకుంది. పోలింగ్ కోసం మొత్తంగా 34,604 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 11న సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు..మిగిలిన ప్రాం తాల్లో సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

ప్ర‌లోభాల ప‌ర్వం పై ఇసి డేగ క‌న్ను...ఏపిలో 162 కోట్లు స్వాధీనం

ప్ర‌లోభాల ప‌ర్వం పై ఇసి డేగ క‌న్ను...ఏపిలో 162 కోట్లు స్వాధీనం

ప్ర‌చారం ముగిసింది. రాజ‌కీయ పార్టీలు ప్ర‌లోభాల‌కు తెర లేపారు. అత్య‌ధికంగా జాతీయ స్థాయిలో ఏపిలో ప‌ట్టుబ‌డిన న‌గ‌దు మూడో స్థానంలో ఉంది. ఏపిలో ఇప్ప‌టి వ‌ర‌కు 116 కోట్ల‌కు పైగా న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు.100 కేజీల‌కు పైగా బంగారం ప‌ట్టుకున్నారు. మొత్తంగా ఉచితాల విలువ 190 కోట్లుగా తేల్చారు.పోలింగ్ ముందు వ‌ర‌కు రాజ‌కీయ పార్టీలు మ‌రింత‌గా ప్ర‌లోభాలకు దిగే అవ‌కాశం ఉండ‌టంతో ఎన్నిక‌ల సంఘం చివ‌రి స‌మ‌యంలో నిఘా పెంచింది. డేగ క‌న్నుతో ప్ర‌లోభాల‌ను అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది.

English summary
election campaign closed in AP and telangana. Loksabha elections in Telangana and Assembly and loksabha election in AP held on 11th of this month. Election commission seriously concentrated on Cash and liquor supply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X