వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేటా చోరీని పట్టించుకోని ఎన్నికల సంఘం: ఏపీ ఓటర్ల తుది జాబితా ఇదే:

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే తుది జాబితా అని వెల్లడించింది. ఓటర్ల తుదిజాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డేటా చోరీ ఘటనలు రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న నేపథ్యంలో.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదనే విషయం దీనితో స్పష్టమైంది. రాష్ట్రంలో మొత్తం 3, 69,33, 091గా ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.

పురుషులు, మహిళల ఓటర్ల సంఖ్య ఇదీ..జాబితాలో థర్డ్ జెండర్ కూడా

రాష్ట్రంలో మొత్తం 3, 93, 091 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 1, 83, 24, 588 మంది ఉన్నారు. కాగా, 1,86,04,742 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తేలింది. థర్డ్ జెండర్స్‌ కేటగిరీలో కూడా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3761 మంది థర్డ్ జెండర్ ఓటర్లు నమోదయ్యారు.

డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే. డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే.

తూర్పులో అధికం.. విజయనగరంలో అత్యల్పం

రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఓటర్లు నమోదయ్యారు. అదే క్రమంలో.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో అత్యల్ప ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 40, 13, 770 మంది ఓటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. అలాగే- విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 17, 33, 667 ఓటర్లు ఉన్నారు.

election commission announced electors in Andhra Pradesh

జిల్లాలవారీగా..

శ్రీకాకుళం జిల్లా- 20, 64, 330 మంది, విజయనగరం జిల్లా- 17, 33, 667, విశాఖపట్నం జిల్లా- 32, 80, 028, పశ్చిమగోదావరి జిల్లా- 30,57,922, కృష్ణా జిల్లా - 33,03,592, గుంటూరు జిల్లా- 37,46,072 మంది, ప్రకాశం జిల్లా-24,95,383, నెల్లూరు జిల్లా-22,06,652 మంది, కడప జిల్లా- 20, 56, 660, కర్నూలు జిల్లా- 28,90,884, అనంతపురం జిల్లా- 30, 58, 909, చిత్తూరు జిల్లా- 30, 25, 222 మంది ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

English summary
Elections commission of India announced fresh Voters list of Andhra Pradesh for upcoming Lok Sabha and Assembly elections. The total number of Voters in Andhra Pradesh that 3, 69,33, 091. Where as East Godavari district stand on number one position with highest number of Voters with 40, 13, 770 and Vizayanagaram took last as lower number of Voters with 17, 33, 667.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X