వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేని దివ్యంగుల కోసం ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపిక చేసిన కొన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ఆటోలు, ఇతర వాహనాల వసతిని కల్పించారు. ఉచిత వాహన వసతిని వినియోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

దివ్యంగులు, నడవలేని స్థితిలో ఉన్న వయోధిక వృద్దులు ఉచిత రవాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో సుమారు 83 వేల మందికిపైగా దివ్యంగుల ఓటర్లు ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు- దివ్యంగులకు సహకరించడానికి వాలంటీర్లను నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వేయడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.

Election commission arranged free transport for handicapped voters

అయిదేళ్లకు ఒకసారి వచ్ఛే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పిచామని అన్నారు. ఎవరి ఒత్తిళ్లకు, అలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Election Commission of India made a special arrangements fot the Voters, who is unable to go independently to cast their Votes. Election Commission Officers arranged free Transport facility like Autos and other vehicles for Physically handicapped Voters and Senior Citizens in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X